5 కోట్లు పెడితే 14 లక్షలు వచ్చాయి

By iDream Post Apr. 09, 2020, 01:57 pm IST
5 కోట్లు పెడితే 14 లక్షలు వచ్చాయి

పరిశ్రమలో ఎంత అనుభవం ఉన్న దర్శక నిర్మాతలైనా ఒక సినిమా విడుదలకు ముందు అది ఆడుతుందా లేదానేది ఖచ్చితంగా చెప్పలేరు. కొన్ని ఐడియాలు ఎగ్జైట్ చేసినంత తీరా షూటింగ్ మోత్తం పూర్తయి విడుదలయ్యాక ఫలితాలు ఉండవు. అలాంటి అనుభవమే ప్రముఖ దర్శక నిర్మాత గుణ్ణం గంగరాజు గారిది. రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, ఆర్ట్ డైరెక్టర్ గా, టీవీ సినిమా రంగాల్లో కొత్త ప్రయోగాలకు తెరతీసిన ఈయన పేరు ఐతే సినిమా నుంచి బాగా లైమ్ లైట్ లోకి వచ్చింది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు గంగరాజు గారు నిర్మాతగా రచయితగా వ్యవహరించడమే కాక విలన్ కు డబ్బింగ్ కూడా చెప్పారు.

చాలా ఏళ్ళ క్రితమే లిటిల్ సోల్జర్స్ తో అవార్డులు రివార్డులు అందుకున్న గంగరాజు గారికి రైటర్ గా అమృతం సీరియల్ ఎనలేని కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది. 300 ఎపిసోడ్లకు పైగా గంగరాజు పూయించిన నవ్వుల వర్షంలో ప్రేక్షకులు ఇప్పటికీ తడుస్తూనే ఉంటారు. అలాంటిది ఓసారి వచ్చిన ఓ క్రియేటివ్ ఐడియా కోట్ల రూపాయలు పోగొట్టింది అంటే నమ్మగలమా. కానీ ఇది నిజం. అమృతం సీరియల్ కు వచ్చిన పాపులారిటి చూసి గంగరాజు గారికి దీన్నే చందమామ మీద కాన్సెప్ట్ తో సినిమా తీస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. అనుకోవడం తడవు తనే దర్శకుడిగా రంగం సిద్ధం చేసుకున్నారు. 2006లో అమ్మ చెప్పింది దెబ్బ తిన్నాక మళ్ళీ మెగాఫోన్ జోలికి వెళ్ళలేదు.

మళ్ళీ 7 ఏళ్ళ గ్యాప్ తర్వాత 2014లో 'చందమామలో అమృతం' పేరుతో భారీగా సినిమా తీసేశారు. క్యాస్టింగ్ తో పాటు ప్రొడక్షన్ విషయంలో రాజీ పడకుండా పూర్తి చేశారు. ఫైనల్ బడ్జెట్ 5 కోట్ల దాకా తేలింది. కట్ చేస్తే సినిమా డిజాస్టర్. కోట్లు బూడిదలో పోసినట్టు అయ్యింది. లెక్క చూసుకుంటే చేతికి 14 లక్షలు వచ్చాయి. అంటే దాదాపు పెట్టిన సొమ్ము మొత్తం హారతి కర్పూరమయ్యింది. కొన్ని ఆస్తులు కూడా అమ్మేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్న ఏదో కొత్త ఆలోచన వచ్చిందని సినిమా తీస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయో ఉదాహరణగా తన గురించే గంగరాజు స్వయంగా చెప్పుకోవడం విశేషం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp