'క్రాక్' లో ఫ్యామిలీ యాంగిల్

By iDream Post Apr. 02, 2020, 10:26 am IST
'క్రాక్' లో ఫ్యామిలీ యాంగిల్

మాస్ మహారాజా రవితేజ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న వేళ ఆ కొరత క్రాక్ తో తీరుతుందన్న నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. కరోనా ఎఫెక్ట్ వల్ల చివరి స్టేజి పనుల్లో బ్రేక్ పడటంతో రవితేజ లాక్ డౌన్ పీరియడ్ ని ఇంట్లో ఫామిలీ మెంబెర్స్ తో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా టీమ్ వదిలిన స్టిల్ ఒకటి హాట్ టాపిక్ గా మారింది. గతంలో రిలీజ్ చేసిన టీజర్ ప్రకారం క్రాక్ అవుట్ అండ్ అవుట్ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనే మెసేజ్ ఇచ్చారు. దానికి తగ్గట్టే అందులో విజువల్స్ అలాగే ఉన్నాయి. రొమాన్స్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవేవి లేవన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు.

అయితే ఆ అంచనాలకు బ్రేక్ ఇస్తూ ఇందులో భావోద్వేగాలు కూడా ఉన్నాయని చెప్పేలా విడుదల చేసిన కొత్త పోస్టర్ ఆకట్టుకుంటోంది. భార్యగా నటిస్తున్న శృతి హాసన్ తో పాటు మరో చైల్డ్ ఆర్టిస్ట్ తో రవితేజ సరదాగా గడుపుతున్న ఆ పిక్ ని బట్టి ఇందులో ఫ్యామిలీ యాంగిల్ కూడా బలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే ఇది ఫ్లాష్ బ్యాక్ ట్రాక్ లో వస్తుందా లేక సమాంతరంగా నడుస్తుందా అనేది వేచి చూడాలి. దర్శకుడు గోపీచంద్ మలినేనికి ఇది రవితేజతో హ్యాట్రిక్ మూవీ అవ్వాలన్న నమ్మకంతో ఉంది ట్రేడ్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను-బలుపు రెండూ కమర్షియల్ బ్లాక్ బస్టర్ కావడమే దీనికి కారణం.

అందులోనూ రవితేజ పవర్ తర్వాత పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయలేదు. ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో అంతుచిక్కని రీతిలో దొంగతనాలు చేసే ఓ ముఠాను పట్టుకునే ఆఫీసర్ గా రవితేజ పాత్ర చాలా టెర్రిఫిక్ గా ఉంటుందట. విలన్ గా సముతిరఖని, వరలక్ష్మి శరత్ కుమార్ లు నటించడం మరో ఆకర్షణగా నిలుస్తోంది. రవితేజతో ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన థమన్ సంగీతం మరో ప్లస్ పాయింట్ గా నిలుస్తోంది. కరోనా వల్ల ఇప్పటికే వాయిదా పడిన సినిమాలు చాలా ఉన్నాయి కాబట్టి క్రాక్ కొత్త డేట్ ఎప్పుడు ఉంటుందనేది వేచి చూడాలి. టాగోర్ మధు నిర్మిస్తున్న క్రాక్ కు సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తుండటం విశేషం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp