ఎఫ్2కి జాతీయ స్థాయి అవార్డు

By iDream Post Oct. 21, 2020, 07:58 pm IST
ఎఫ్2కి జాతీయ స్థాయి అవార్డు

గత ఏడాది సంక్రాంతికి తీవ్రమైన పోటీ మధ్య విడుదలై కేవలం ఎంటర్ టైన్మెంట్ తో ప్రేక్షకులను మెప్పించి కోట్లాది వసూళ్లు రాబట్టుకున్న వెంకటేష్ వరుణ్ తేజ్ ల ఎఫ్2కి కేంద్ర ప్రభుత్వం అరుదైన గుర్తింపు ఇచ్చింది. 2019 ఇండియన్ పనోరమా అవార్డ్స్ లో తెలుగు నుంచి బెస్ట్ ఫీచర్ ఫిలింగా గౌరవం దక్కింది. హిందీలో ఉరి, గల్లీ బాయ్, సూపర్ 30, బదాయి హో, తమిళం నుంచి హౌస్ ఓనర్, మలయాళంలో జల్లికట్టు తదితరాలు ఈ అవార్డును దక్కించుకున్నాయి. లాక్ డౌన్ టైంలో దిల్ రాజు టీమ్ కి ఇది బంపర్ న్యూస్ అనే చెప్పాలి. ఇంకే తెలుగు సినిమాకు ఈ పురస్కారం దక్కలేదు. ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే.

నిజానికి ఎఫ్2 ఒక కమర్షియల్ ఎంటర్ టైనర్. సరదాగా సాగే జోకులు, వెంకీ మార్కు కామెడీ టైమింగ్, గిర్రా గిర్రా అంటూ సాగే తమన్నా మెహ్రీన్ ల మసాలా సాంగ్, రెగ్యులర్ ఫార్మట్ లో చొప్పించిన పాటలు వెరసి ఇదో సగటు తెలుగు వినోదాత్మక చిత్రం అంతే. అయితే ఇండియన్ పనోరమాకు దీన్ని ఎంపిక చేసుకోవడం మాత్రం ఆశ్చర్యం కలిగించేదే. ఎందుకంటే ఇతర భాషల్లో ఎంపికైన చిత్రాల్లో ఏదో ఒక యునీక్ పాయింట్ కనిపిస్తుంది. అవన్నీ రెగ్యులర్ ఆడియన్స్ టేస్ట్ కి భిన్నంగా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో రూపొంది మెప్పించినవి. కానీ వాటిసరసన ఎఫ్2 రావడం అంటే సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి.

ఒకవేళ ఆ సినిమా సాధించిన విజయాన్ని ప్రామాణికంగా తీసుకున్నారో ఏమో. ఎందుకంటే గత ఏడాదే సైరా, జెర్సి , మహర్షి, మల్లేశం లాంటి థీమ్ బేస్డ్ మూవీస్ చాలా వచ్చాయి. అవి ఎందుకు పరిశీలనలోకి రాలేదో మరి. వసూళ్ల పరంగా పోల్చుకుంటే ఎఫ్2 అన్నింటి కన్నా టాప్ గా నిలుస్తుంది కానీ ఇండియా పనోరమా ఎప్పుడూ ఆ కోణంలో విశ్లేషించి నిర్ణయం తీసుకోదు. ఏదైతేనేం మొత్తానికి జాతీయ స్థాయిలో మన సినిమాకు మరోసారి గుర్తింపు దక్కింది. కొన్నేళ్ల క్రితం శతమానం భవతికి జాతీయ అవార్డు సాధించిన దిల్ రాజుకు ఇంత తక్కువ గ్యాప్ లో మరో పురస్కారం దక్కడం విశేషం. ప్రస్తుతం ఎఫ్3 సీక్వెల్ కి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp