2020లోనూ సాహోకి గట్టి షాక్

By iDream Post Oct. 29, 2020, 01:55 pm IST
2020లోనూ సాహోకి గట్టి షాక్

రెండేళ్ళ క్రితం ఆకాశమే హద్దుగా పెట్టుకున్న అంచనాలతో బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన విజువల్ యాక్షన్ వండర్ గా విడుదలైన సాహో ఎలాంటి ఫలితం అందుకుందో ఎవరైనా మర్చిపోవడం కష్టమే. పాత రికార్డులు బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టిస్తుందేమో అనుకున్న అభిమానుల ఆశలను నీరుగారుస్తూ ఫైనల్ గా డిజాస్టర్ గా మిగిలింది. హిందిలో పర్వాలేదు అనిపించుకున్నా తెలుగు ప్రేక్షకులు మాత్రం నిర్మొహమాటంగా తిరస్కరించారు. సెటప్ భారీగా ఉన్నా దానికి సరిపడా కథాకథనాలు, సంగీతం ఇవీవి కనీస స్థాయిలో లేకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశాజనకమైన ఫలితం దక్కింది. సరే గతం గతః అనుకుంటే తాజాగా సాహోకి మరో షాక్ తగిలింది.

దసరాను పురస్కరించుకుని ఇటీవలే సాహో మొదటి సారి ఓ శాటిలైట్ ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు నోచుకుంది. ఫస్ట్ టైం కాబట్టి రేటింగ్ భారీగా వస్తాయి అందరూ ఆశించారు. కాని ఎవరూ ఊహించని విధంగా కేవలం 5.8 టిఆర్పి రేటింగ్ తో గట్టి దెబ్బే తింది. దీనికి ఏ మాత్రం పోటీగా నిలిచే స్థాయి లేని కార్తికేయ గుణ 369 సాహో కంటే మెరుగ్గా 5.9 రేటింగ్ తెచ్చుకోవడం ఇప్పటికీ మానని గాయం మీద కారం చల్లినట్టు అయ్యింది. లేట్ గా ప్రసారం అవుతున్నా ప్రభాస్ క్రేజ్ వల్ల జనం ఎగబడి చూస్తారన్న సదరు ఛానల్ లెక్కలు పూర్తిగా తప్పాయి. ఇప్పుడే ఇలా వస్తే ఇక రీ టెలికాస్ట్ గురించి చెప్పెదేముంది.

నిజానికి టివి ప్రీమియర్స్ కు బాక్స్ ఆఫీస్ ఫలితంతో సంబంధం లేకుండా రేటింగ్స్ వస్తాయి. వినయ విదేయ రామ దానికి మంచి ఉదాహరణ. అయితే సాహోకు ఇలా జరగడానికి కారణం ఉంది. ఇప్పుడంటే బుల్లితెరపై వచ్చింది కాని విడుదలైన వంద రోజులకే ప్రైమ్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేశారు. అప్పుడే భారీ వ్యూయర్ షిప్ వచ్చింది. దానికి తోడు పైరసీ టోరెంట్స్, లోకల్ కేబుల్ ఛానల్స్ లో వేయడం లాంటి వాటి వల్ల సాహోని వివిధ రూపాల్లో పబ్లిక్ చాలా సార్లు చూశారు. అందుకే రెండేళ్ళ జాప్యానికి తగిన మూల్యం చెల్లిస్తూ సాహో టీవీ రేటింగ్స్ లోనూ ఫెయిల్యూర్ మూటగట్టుకోవాల్సి వచ్చింది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp