టాప్ 2 హీరోయిన్ల కాంబోతో దుల్కర్

By iDream Post Dec. 02, 2020, 02:20 pm IST
టాప్ 2 హీరోయిన్ల కాంబోతో దుల్కర్

మమ్ముట్టి వారసుడిగా మలయాళంలో ఎంత ఫాలోయింగ్ ఉన్నా దుల్కర్ సల్మాన్ కు తెలుగులో గుర్తింపు వచ్చింది మాత్రం మహానటితోనే. కీర్తి సురేష్ తో పోల్చుకుంటే పాత్ర పరిధి తక్కువే అయినప్పటికీ తన ఉనికిని గట్టిగానే చాటుకున్నాడు. ఓకే బంగారంతో తెలుగులో యూత్ ని ఎప్పుడో ఆకట్టుకున్నాడు కానీ ఇటీవలే వచ్చిన కనులు కనులను దోచాయంటే మన ఆడియన్స్ ని ఇంకా దగ్గర చేసింది. అందులోనూ కష్టమైనా తనే స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం లాంటి అంశాలు దుల్కర్ మీద ఇంకా సాఫ్ట్ కార్నర్ వచ్చేలా చేస్తున్నాయి. స్వంత భాషలో ఎంత బిజీగా ఉన్నా తెలుగు తమిళ ఆఫర్లని ఇతను నిర్లక్ష్యం చేయడం లేదు.

చాలా రోజుల క్రితం దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో స్వప్న సినిమా బ్యానర్ పై ఓ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పీరియాడిక్ లవ్ స్టోరీగా యుద్ధ నేపథ్యంలో సాగే ఈ భారీ బడ్జెట్ మూవీకి ఇప్పుడు హీరోయిన్స్ ఫైనల్ అయ్యారని తెలిసింది. ఒకరు పూజా హెగ్డే కాగా మరొకరు రష్మిక మందన్న. ఈ ఇద్దరూ ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు సౌత్ లోనే మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న టాప్ 2 భామలు. వీళ్ళను క్యాస్టింగ్ చేసుకున్నారంటే బడ్జెట్ విషయంలో రాజీ పడటం లేదనే క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే ఈ విషయాన్ని యూనిట్ ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

ఎమోషనల్ జర్నీగా సాగే ఈ ప్రేమకథలో దుల్కర్ సైనికుడి పాత్ర పోషిస్తుండగా పూజా, రష్మిక క్యారెక్టర్లు ఎలా ఉంటాయా అన్న ఆసక్తి అభిమానుల్లో మొదలయ్యింది. హను రాఘవపూడి పడి పడి లేచే మనసు డిజాస్టర్ తర్వాత గ్యాప్ తీసుకున్నాడు. సెన్సిబుల్ లవ్ స్టోరీస్ ని తెరకెక్కించడంతో తనకంటూ ప్రత్యేకత కలిగిన హను ఈసారి స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట. షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుందో ఇంకా తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ కావొచ్చంటున్నారు. విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో దీన్ని సమాంతరంగా విడుదల చేస్తారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp