దూసుకెళ్తున్న దేవి శ్రీ ప్రసాద్‌

By Press Note Dec. 23, 2019, 01:40 pm IST
దూసుకెళ్తున్న దేవి శ్రీ ప్రసాద్‌

టాలీవుడ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ దేవి శ్రీ ప్రసాద్‌ తన సంగీతంతో తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ సినిమాల్లో కూడా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే..

ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక ఫిలింఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవంలో రామ్‌చరణ్‌ హీరోగా నటించిన 'రంగస్థలం' చిత్రానికి గాను దేవి తన 9వ ఫిలిం ఫేర్‌ అవార్డ్‌ అందుకున్నారు. ఏస్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 'సరిలేరు నీకెవ్వరు'తో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్నఈ చిత్రం కోసం దేవి అద్భుతమైన ట్యూన్స్‌ అందించారు. ఇప్పటి వరకు విడుదలైన పాటలన్నీ అద్భుత స్పందనతో అన్ని వర్గాల శ్రోతల్ని విశేషంగా ఆకట్టకుంటున్నాయి. ఈ పాటలపై ప్రేక్షకులు చేసిన కొన్ని లక్షల టిక్‌ టాక్‌ వీడియోస్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇవాళ విడుదల కానున్న నాలుగో పాట 'సరిలేరు నీకెవ్వరు ఆంథమ్‌' కోసం సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దేవి శ్రీ ప్రసాద్‌ ఈ థీమ్‌ సాంగ్‌ని మేసెడోనియన్‌ సింఫనీ ఆర్కస్ట్రాతో రికార్డ్‌ చేయడం విశేషం. లెజెండరీ సింగర్‌ శంకర్‌ మహదేవన్‌ ఈ పాటని ఆలపించారు. ఇప్పటికే ఈ పాట మేకింగ్‌ విడియో ట్రెండింగ్‌లో ఉంది. తన సంగీతంతో దూసుకెళ్తున్న దేవికి ఫిలింఫేర్‌ రావడంతో తన అభిమానులు, సంగీత ప్రియులు అభినందనలు తెలుపుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp