పుష్ప కోసం లోఫర్ బ్యూటీ ?

By iDream Post May. 02, 2020, 11:03 am IST
పుష్ప కోసం లోఫర్ బ్యూటీ ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప టీమ్ కరోనా గొడవ ఎప్పుడు సద్దుమణుగుతుందా అని ఎదురు చూస్తోంది. నిన్న మరో రెండు వారాలు లాక్ డౌన్ ఎక్స్ టెన్షన్ ప్రకటించారు. హైదరాబాద్ ఇంకా రెడ్ జోన్ లోనే ఉంది. సెప్టెంబర్ దాకా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు రాదనీ పరిశ్రమ పెద్దలు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు సుకుమార్ మిగలిన పనులు పూర్తి చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. తన ప్రతి సినిమాలో ఒక ప్రత్యేకతను ప్లాన్ చేసుకునే సుక్కు ఇందులో అలాంటి ఒక అదిరిపోయే ఐటెం సాంగ్ ను దేవిశ్రీప్రసాద్ తో ప్రత్యేకంగా కంపోజ్ చేయిస్తున్నారట.

రింగా రింగాను మించిపోయే తరహాలో తమన్ కొట్టిన రాములో రాములోని బీట్ చేసే టార్గెట్ తో దేవి చాలా కసిగా దీని మీద వర్క్ చేస్తున్నాడని తెలిసింది. ఇప్పటికే ఒరిజినల్ రా ట్యూన్ ని ఆన్ లైన్ ద్వారా బన్నీకి మెయిల్ చేశారట. ఇప్పటికే అతను కూడా రిపీట్ మోడ్ లో వింటూ ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పుడీ పాటలో చిందులు వేసే ఛాన్స్ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానికి దక్కిందని ఇన్ సైడ్ టాక్. పూరి డైరెక్షన్ లో రూపొందిన లోఫర్ ద్వారా పరిచయమైన దిశా ఆ తర్వాత బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోయి ఆ తర్వాత ఇటు చూడనే లేదు.

కొంతకాలం బాగానే సాగింది కాని ఇటీవలి కాలంలో తన ట్రాక్ రికార్డు మరీ టాప్ హీరొయిన్ రేంజ్ లో ఏమి లేదు. అందుకే సౌత్ వైపు చూస్తోందట. డ్రెస్ విషయంలో ఏ మొహమాటం లేకుండా దేనికైనా రెడీ అనే దిశా పటాని అయితే మాస్ కి మంచి కిక్ వస్తుందని భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న పుష్పలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తుండగా డేట్స్ సమస్య వల్ల అతని స్థానంలో బాబీ సింహా వచ్చినట్టు గాసిప్ ప్రచారంలో ఉంది కాని ప్రస్తుతానికి యూనిట్ దాని గురించి మాట్లాడ్డం లేదు. సో పుష్ప అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఇంకొన్నాళ్ళు వేచి చూడక తప్పదు మరి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp