తారక్ సినిమాని దెబ్బ తీసిన ప్రభాస్

By iDream Post Apr. 03, 2020, 04:22 pm IST
తారక్ సినిమాని దెబ్బ తీసిన ప్రభాస్

ఏదైనా సినిమా సక్సెస్ అవ్వడానికి లేదా ఫెయిల్యూర్ అందుకోవడానికి చాలా కారణాలు ఉంటాయి. చాలా గొప్పగా ఊహించుకున్న చిత్రం ఘోరంగా దెబ్బ తింటుంది. ఏం ఆడుతుందిలే అని అనుమానపడ్డది బ్లాక్ బస్టర్ అవ్వొచ్చు. ఇక్కడ రకరకాల అంశాలు ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు వాటిని అంచనా వేయడం తలలు పండిన నిర్మాతల వల్ల కూడా కాకపోవచ్చు. సుప్రసిద్ధ నిర్మాత దిల్ రాజు అనుభవం వింటే ఇది ఎంత నిజమో అర్థమవుతుంది. 2013లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రామయ్య వస్తావయ్యా ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యిందో అందరికి తెలిసిందే.

గబ్బర్ సింగ్ డైరెక్టర్ నుంచి ఇలాంటి సినిమా ఆశించలేదని ఫ్యాన్స్ నేరుగానే సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. నిజానికి దీనికి ముందు అనుకున్న కథ వేరు. తండ్రి చావుకి ప్రతీకారంగా హీరో రివెంజ్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో వేరే స్టోరీని సెట్ చేసుకున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభించాలనుకున్న సమయానికి ప్రభాస్ రెబెల్ రిలీజ్ అయ్యింది. అందులోనూ ఇదే పాయింట్ ఉంది. కృష్ణంరాజు మరణానికి కారణమైన వాళ్ళను వెతికి పట్టుకునే పాత్రలో ప్రభాస్ ని చూపించారు. దీంతో దిల్ రాజు ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు ఇదే కథతో కంటిన్యూ అయితే రెబెల్ తో పోలిక తెచ్చి రామయ్య వస్తావయ్యా మీద నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చే అవకాశం ఉందని డౌట్ వచ్చి హరీష్ శంకర్ ని కథను మార్చమని చెప్పారు. దీంతో తండ్రి బదులు ఫ్లాష్ బ్యాక్ లో లవర్ చనిపోయేలా మార్చేసి మొత్తం వేరే ప్లాట్ తో స్క్రిప్ట్ ని ఫైనల్ చేశారు.

కానీ ఇంత చేసినా ఫలితం దక్కలేదు. అటు రెబెల్ ఇటు రామయ్య వస్తావయ్యా రెండూ డిజాస్టర్ అయ్యాయి. ఒకవేళ ముందు అనుకున్న కథతోనే రామయ్య వస్తావయ్యా ప్రొసీడ్ అయ్యుంటే ఖచ్చితంగా హిట్ కు ఛాన్స్ పెరిగేదని, కానీ అనుమానం మెదడుని తొలిచేయడంతో కథను మార్చేసి ఫ్లాపును మూటగట్టుకున్నామని ఒప్పుకున్నారు దిల్ రాజు. ఒక్కోసారి ఇలాంటి సందర్భాల్లో కథలో చేసే మార్పులు సక్సెస్ కు కారణం అయితే ఇంకొన్ని సార్లు దెబ్బ తినేందుకు అవకాశం కలిగిస్తాయి. ఏదైనా నేర్చుకునే పాఠమే అని చెప్పే దిల్ రాజు ఇన్నేళ్ల ప్రయాణంలో బ్లాక్ బస్టర్స్ చూశారు ఫ్లాపులూ టేస్ట్ చేశారు. రెబెల్ కు భయపడి రామయ్య వస్తావయ్యాను మార్చుకోవడం మొత్తానికి భారీ మూల్యాన్నే చెల్లించేలా చేసింది. సినిమా పరిశ్రమలో ఇలాంటి ఆశ్చర్యపరిచే సంగతులెన్నో

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp