తెరవెనుక ఏం జరుగుతోంది

By iDream Post Apr. 12, 2021, 12:00 pm IST
తెరవెనుక ఏం జరుగుతోంది
ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ 30కి సంబంధించి కీలకమైన ప్రకటన రాబోతున్నట్టు అప్ డేట్ తెలియడంతో ఫ్యాన్స్ అలెర్ట్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చేయబోతున్న సినిమా కావడం వల్ల అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానికి ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతుందని గతంలోనే అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్-హారిక హాసిని సంయుక్తంగా నిర్మిస్తామని చెప్పారు. అప్పుడప్పుడు చిన్న చిన్న ఫీలర్లు కూడా వదిలేవారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు సీన్ మారిపోయినట్టు కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు ఉంటుందా లేదా అనే అనుమానాలను నిజం చేస్తూ ఈ రోజు సాయంత్రం పరిణామం ఉండొచ్చని టాక్.

ఊహించని విధంగా జూనియర్ - కొరటాల శివ కాంబోలోనే ఎన్టీఆర్ 30 ఉండొచ్చనేది ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న మాట. అయితే అల్లు అర్జున్ కి ఆల్రెడీ కమిట్ అయిన కొరటాల ఇదెలా చేయగలడు అనే డౌట్ రావడం సహజం. పుష్ప అనుకున్న టైంకి పూర్తయ్యే అవకాశాలు తగ్గిపోతుండటంతో వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాతే బన్నీ ఫ్రీ అవుతాడట. కొరటాల శివ ఈ వేసవిలోగా ఆచార్యని ఫినిష్ చేసి ఫ్రీ అవుతారు. ఆపై ఆరేడు నెలలు ఖాళీగా ఉండటం అంటే కష్టం. ఇప్పటికే మెగాస్టార్ మూవీ కోసం మూడేళ్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అందుకే అనూహ్యంగా తారక్ కాంబో సెట్ అయినట్టుగా చెబుతున్నారు.

ఇక్కడి చెప్పినవాటికి చెక్ పడేది సాయంత్రం 7 తర్వాతే. అసలు త్రివిక్రమ్ కు తారక్ కు ఎక్కడ తేడా కొట్టిందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. నిజంగా వాయిదా పడిందా లేదా ఇదంతా వట్టి ప్రచారమేనా తెలియాలంటే కూడా వేచి ఉండాల్సిందే. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ కోసం మూడు సంవత్సరాలకు పైగా సమయాన్ని త్యాగం చేసిన యంగ్ టైగర్ ప్రభాస్ తరహాలో వేగం పెంచాలని నిర్ణయించుకున్నాడు. ఎక్కువ కాలం వృధా కాకుండా తనతో తక్కువ టైంలో కమర్షియల్ ఎంటర్ టైనర్స్ తీసేవాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారట. మరి జనతా గ్యారేజ్ మ్యాజికల్ కాంబినేషన్ మరోసారి సెట్ అవ్వబోతోందో లేదో ఇంకొద్ది గంటల్లో తేలిపోతుంది
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp