13 ఏళ్ళ తర్వాత ఢీ సీక్వెల్ - అఫీషియల్

By iDream Post Nov. 23, 2020, 05:55 pm IST
13 ఏళ్ళ తర్వాత ఢీ సీక్వెల్ - అఫీషియల్

ఫ్లాపు ఫ్లాపు కలిస్తే హిట్టు వస్తుందనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో లేదు కానీ గతంలో కొన్నిసార్లు ప్రూవ్ అయిన సందర్భాలు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు అదే లక్ష్యంతో ఓ కాంబినేషన్ సెట్ అయ్యింది. మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందబోయే డీ అండ్ డీని ఇవాళ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 13 ఏళ్ళ క్రితం ఇదే కాంబోలో వచ్చిన ఢీ ఎంత పెద్ద హిట్టో మూవీ లవర్స్ మర్చిపోలేదు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆ సినిమా తాలూకు వీడియోలు, స్క్రీన్ షాట్లని మేమ్స్ రూపంలో వాడుకుంటూనే ఉన్నారు. అంతగా కామెడీలో ఓ డిఫరెంట్ ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఢీ. దానికి సీక్వెలే ఈ ఢీ అండ్ ఢీ.

నిజానికి మంచు విష్ణు, శ్రీను వైట్లలు చాలా బ్యాడ్ పీరియడ్ లో ఉన్నారు. విష్ణుకి 2016లో వచ్చిన ఆడో రకం ఈడో రకం ఆఖరి హిట్టు. ఆ తర్వాత అంతకు ముందు చాలా ఫ్లాపులు పలకరించాయి. ఆచారి అమెరికా యాత్ర, వోటర్ మరీ దారుణంగా దెబ్బ తిన్నాయి. మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేని విధంగా మార్కెట్ బాగా డౌన్ అయ్యింది. అయినా నెరవకుండా మోసగాళ్లు అనే పాన్ ఇండియా మూవీని నిర్మించిన విష్ణు ఢీ అండ్ ఢీకి కూడా ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. అప్పట్లో ఢీ ఫార్ములా బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యింది కానీ ఆ తర్వాత అది రొటీన్ గా మారిపోయి ప్రేక్షకులకు వెగటు వచ్చేసింది.

ఇక శ్రీను వైట్ల సంగతి చూస్తే వరసగా నాలుగు డిజాస్టర్లు స్టార్ల నమ్మకాన్ని పోగొట్టేశాయి. మహేష్ బాబు ఆగడు, రామ్ చరణ్ బ్రూస్లీ, వరుణ్ తేజ్ మిస్టర్, రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ ఇలా ఏ అవకాశాన్ని శ్రీను వైట్ల వాడుకోలేకపోయాడు. పదే పదే రొటీన్ దారిలో వెళ్లి గ్యాప్ తెచ్చేసుకున్నాడు. మళ్ళీ జీరో నుంచి మొదలుపెట్టాల్సి వస్తోంది. ఇప్పుడు ఢీ అండ్ ఢీ ని సరిగా వాడుకుని హిట్టు కొడితే సరేసరి. లేదా అంతే సంగతులు. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా గోపి మోహన్ రచన, పీటర్ హెన్స్ ఫైట్స్ సమకూరుస్తున్నారు. మరి సూపర్ హిట్ కోసం కలిసిన ఈ డిజాస్టర్ కాంబో ఏం చేస్తుందో

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp