హాలీవుడ్ లో దీపికా పదుకొనె డబుల్ ధమాకా ..

By iDream Post Sep. 01, 2021, 12:00 pm IST
హాలీవుడ్ లో దీపికా పదుకొనె డబుల్ ధమాకా ..

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ బిజీగా అయింది.ఓం శాంతి ఓం తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దీపికా చెన్నై ఎక్స్ ప్రెస్,రామ్ లీలా,పీకు, బాజిరావ్ మస్తాని,పద్మావత్ వంటి సినిమాలతో మంచి పేరు సంపాదించింది. 2017లో హాలీవుడ్ యాక్షన్ స్టార్ విన్ డీజిల్ తో మొదటి సినిమా త్రిబుల్ ఎక్స్ లో నటించిన దీపికా పడుకొనే నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మరో హాలీవుడ్ సినిమాలో చేసేందుకు దీపిక రెడీ అవుతోంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లుగా హాలీవుడ్ లోనూ రాణించేందుకు దీపిక ప్రయత్నిస్తోంది. అయితే ఈసారి దీపికా యాక్షన్ మూవీలో కాకుండా రొమాంటిక్ కామెడీ స్టొరీతో తెరకెక్కుతున్న మూవీలో నటించబోతున్న ట్లు తెలుస్తోంది.

ఇంకో ముఖ్య విషయం ఏంటంటే STX ఫిలిమ్స్, టెంపుల్ హిల్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తోన్న ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో దీపికా హీరోయిన్ గా నటిస్తూనే తన నిర్మాణ సంస్థ కా ప్రొడక్షన్ ద్వారా సహ నిర్మాతగా వ్యవహరిస్తుంది. 2012లో “ఛపాక్” అనే సినిమాతో దీపికా పదుకొనే నిర్మాతగా మారిన దీపికా ఇప్పుడు హలీవుడ్ లో హీరోయిన్, నిర్మాతగా డ్యూయల్ రోల్ కు సిద్ధం అయింది. ఈ సినిమాకి సంబందించిన మిగతా వివరాలు ఏవీ బయటకు రానప్పటికీ దీపికా హాలీవుడ్ లో రెండో మూవీపై సంతకం కూడా చేసింది.

హాలీవుడ్ తో పాటు బాలీవుడ్ టాలీవుడ్ సినిమాల్లో కూడా దీపిక నటిస్తూ బిజీగా మారింది. టాలీవుడ్ లో ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త మూవీ “ప్రాజెక్ట్ కే” టీంతో స్క్రిప్ట్ డిస్కర్షన్ లో కూడా పాల్గొంటుందట. బాలీవుడ్లో లో షారుక్ "పఠాన్" మూవీలో ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తుంది, తన భర్త రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'సర్కస్' సినిమాలో క్యామియో రోల్ పోషించనుంది. ఇలా వరుస సినిమాలతో బిజీ అయింది.

Also Read : పూరీ జగన్నాధ్ కి ఆఫ్రికాతో ఉన్న లావాదేవీలేంటి, ఈడీ అడిగిన ప్రశ్నలేంటి?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp