దగ్గుబాటి బ్రదర్స్ తో అబ్బాయి సంబరం

By iDream Post Aug. 08, 2020, 03:15 pm IST
దగ్గుబాటి బ్రదర్స్ తో అబ్బాయి సంబరం

ఇవాళ దగ్గుబాటి రానా పెళ్లికి అంతా సిద్ధమైపోయింది. రామానాయుడు స్టూడియో వేదికగా భారీ ఎత్తున ఈ వేడుక జరుపుతున్నా అతిధులు మాత్రం చాలా పరిమితంగా రాబోతున్నారు. మొత్తం శానిటైజ్డ్ వాతావరణంలో జరగబోయే ఈ వివాహాన్ని వర్చువల్ గా ఇంటి నుంచే చూసేలా తమ సన్నిహితులు, స్నేహితులు, బంధువులు, ఇండస్ట్రీ ప్రముఖులు అందరికీ వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్స్ కి డిజిటల్ లింక్ పంపబోతున్నారు. అది క్లిక్ చేస్తే చాలు రానా-మిహికల సంబరాన్ని లైవ్ గా చూడొచ్చు. ఇటీవలే పెళ్లి చెసుకున రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ఇదే విధానాన్ని ఫాలో అయ్యాడు. ఇది సురేష్ సంస్థ వారసుడి పెళ్లి కాబట్టి ఇంకా హై ఎండ్ టెక్నాలజీ వాడబోతున్నారు.

ఇవాళ నాన్న సురేష్, బాబాయ్ వెంకటేష్ లతో రానా తీసుకున్న పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. చాలా రోజుల తర్వాత ఆ ఇంట జరుగుతున్న వేడుక కావడంతో ఆ ఆనందం ముగ్గురి మొహాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. రానా మిహికా ఇద్దరి తరఫున కూడా లిమిటెడ్ గానే ఫ్రెండ్స్ రాబోతున్నట్టు సమాచారం. వాస్తవానికి కరోనా రాకపోయి ఉంటే ఈ ఈవెంట్ టాక్ అఫ్ ది టాలీవుడ్ గా మారేది. అతిరధ మహారధుల కలయికను ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగేది. బాలీవుడ్ నుంచి సైతం అతిధులు ఎందరో రావాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వ నిబంధనలను అనుసరించి సురేష్ బాబు కష్టంగానే గెస్టుల లిస్టుకు కోత వేసుకున్నారు.

ముందస్తు వివాహ కార్యక్రమాలు గత కొద్దిరోజులుగా జరుగుతూనే ఉన్నాయి. నిన్నే రానాను పెళ్లి కొడుకును చేయడం కూడా అయిపోయింది. సినిమాలకు ప్రొడక్షన్ కు టెంపరరీ బ్రేక్ ఇచ్చిన రానా కొద్దిరోజులు అయ్యాక చాల బిజీ కానున్నాడు. ముందుగా కొద్దిపార్ట్ మాత్రమే బాలన్స్ ఉన్న విరాట పర్వం పూర్తి చేయాలి. ఆలోగా థియేటర్లు తెరిస్తే అరణ్య ప్రమోషన్లు ఉంటాయి. దాని తర్వాత హిరణ్యకసిప తాలుకు పనులు మొదలుపెట్టాలి. ఎన్టీఆర్ మహానాయకుడు తర్వాత తెరమీద కనిపించని రానా వచ్చే ఏడాది నుంచి వరసగా అభిమానులకు కనువిందు చేయబోతున్నాడు. ఇవి కాకుండా వెబ్ సిరీస్ లు, టీవీ టాక్ షోలు వగైరాలు ఉండనే ఉన్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp