సినిమాని మీరు చెడ‌గొట్టి స‌మీక్ష‌కుల మీద ప‌డ‌తారెందుకు?

By G.R Maharshi 16-11-2019 05:24 PM
సినిమాని మీరు చెడ‌గొట్టి స‌మీక్ష‌కుల మీద ప‌డ‌తారెందుకు?

వంట వాళ్లు ఎక్కువైతే వంట‌కం చెడిపోతుంది. ఎవ‌డి టేస్ట్ ప్ర‌కారం వాడు ఉప్పు, కారం, పులుపు క‌లిపి తిన‌డానికి వీల్లేకుండా చేస్తారు. సినిమా కూడా అంతే. ఎవ‌డి ప‌ని వాడిని చేయ‌నీయ‌కుండా ప్ర‌తివాడూ వ‌చ్చి గెలుకుతాడు.
క‌థ ద‌గ్గ‌రి నుంచి ఇది మొద‌ల‌వుతుంది. ఇప్పుడు ఎక్కువ డైరెక్ట‌ర్లే ర‌చ‌యిత‌లు కాబ‌ట్టి అత‌ను కొంద‌రు ర‌చ‌యిత‌ల సాయంతో క‌థ త‌యారు చేసుకుంటాడు. దాన్ని మొద‌ట నిర్మాత‌కి కానీ, హీరోకి కానీ వినిపిస్తాడు.

నిర్మాతైతే ఏం చేస్తాడంటే కాసేపు ఆలోచించి త‌న మిత్రుల‌కో, స‌హ నిర్మాత‌ల‌కో ఒక‌సారి వినిపించ‌మంటాడు. వాళ్లు న‌లుగురైదుగురు వింటారు. ఏమీ చెప్ప‌క‌పోతే బావుండ‌ద‌ని నాలుగైదు క‌రెక్ష‌న్లు చెబుతారు. డైరెక్ట‌ర్ స‌చ్చీచెడీ చేసుకొస్తాడు. త‌ర్వాత ఓకే అంటే హీరో ద‌గ్గ‌రికి వెళ‌తాడు.

హీరో క‌థ‌లో ఉన్న పాయింట్ ప‌ట్టుకోకుండా హీరోగా త‌న‌కి బిల్డ‌ప్ లేదంటాడు. హీరోయిజం ఎలివేష‌న్ కాలేదంటాడు. త‌న‌కి త‌క్కువ సీన్స్ ఉన్నాయ‌ని, ల‌వ్ ఎఫిసోడ్ ఇంకా బాగుండాలంటాడు. ఇవ‌న్నీ చేసేస‌రికి డైరెక్ట‌ర్‌ మైండ్‌లోని స‌గం క‌థ దొబ్బుతుంది.

షూటింగ్ స్టార్ట్‌ అయిన త‌ర్వాత హీరోనే కాకుండా కొంద‌రు క‌మెడియ‌న్లు కూడా డైలాగ్‌లు మార్చుతుంటారు. హిట్ మీద ఉన్న డైరెక్ట‌ర్‌కి ఇన్ని త‌లనొప్పులు ఉండ‌వు కానీ, మిగ‌తా వారికి ఇవి త‌ప్ప‌వు.
అనేక క‌రెక్ష‌న్ల త‌ర్వాత అస‌లు ప్లో మిస్స‌వుతుంది. ఎలాగో షూటింగ్ ముగిస్తే ఎడిటింగ్‌లో కూడా కొంద‌రు హీరోలు దూరుతారు. త‌న సీన్‌లే ఫోక‌స్డ్‌గా ఉండాల‌ని కొన్ని ముఖ్య‌మైన సీన్స్ కూడా క‌త్త‌రించేస్తారు. ఫైనల్ కాపీ వ‌చ్చిన త‌ర్వాత కూడా సీనిక్ ఆర్డ‌ర్ మార్చేవాళ్లు కూడా ఉన్నారు.

చివ‌రికి ఒక కిచిడీ సినిమా బ‌య‌ట‌కు వ‌స్తుంది. దాన్ని చూసి స‌మీక్ష‌కులు తిడ‌తారు. సినిమాలో ఏ ద‌శ‌లోనూ ఈ గెలుకుడు కార్య‌క్ర‌మాన్ని ఆప‌లేని డైరెక్ట‌ర్‌, చివ‌రికి స‌మీక్ష‌కుల మీద ప‌డ‌తాడు.
వంద అనుకూల స‌మీక్ష‌లు రాసినా ప్లాప్ సినిమా హిట్ కాదు. వంద ప్ర‌తికూల స‌మీక్ష‌లు వ‌చ్చినా హిట్ సినిమా ప్లాప్ కాదు. ఈ మ‌ధ్య ఏడుచేప‌ల క‌థ అనే సినిమాకి అన్నీ నెగ‌టీవ్ రివ్యూలే వ‌చ్చాయి. కానీ డ‌బ్బులొచ్చాయి.
స‌మీక్ష‌కుల‌ని తిట్ట‌డం ఈ మ‌ధ్య అంద‌రికీ ఫ్యాష‌నైంది.

చెత్త సినిమా తీసి స‌మీక్ష‌కుల మీద చెత్త‌పోస్తే ఎట్లా? డ‌బ్బులు ఊరికే రావు... టికెట్ కొని త‌ల‌నొప్పి తెచ్చుకోడానికి

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.