అదిరిపోతున్న ఆర్ఆర్ఆర్ ట్విస్టులు

By Ravindra Siraj Feb. 13, 2020, 12:26 pm IST
అదిరిపోతున్న ఆర్ఆర్ఆర్ ట్విస్టులు

విడుదలకు ఇంకా ఏడాదికి ఉండగానే ఆర్ఆర్ఆర్ సంచలనాలు మొదలయ్యాయి. ఇప్పటికే బిజినెస్ పరంగా రికార్డులు నమోదు చేస్తున్న రాజమౌళి మల్టీ స్టారర్ గురించి అప్పుడే దేశవ్యాప్తంగా చర్చ మొదలయ్యింది. వచ్చే సంక్రాంతికి ఇంకో సినిమా పోటీకి దింపాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక జూన్ నుంచి ప్రమోషన్ మొదలయ్యాక ఇది ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ నిర్మాతలు సైతం దీని తాలూకు అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు.

ఇదిలా ఉండగా దీని తాలూకు అప్ డేట్స్ కొన్ని ఫ్యాన్స్ కు పిచ్చ కిక్ ఇస్తున్నాయి. అందులో మొదటిది రామ్ చరణ్ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ మీద దాడి చేయడం గురించి. యూనిట్ లో పాల్గొన్న ఓ చిన్న ఆర్టిస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇది రివీల్ కావడంతో ఈ వార్త కాస్తా వైరల్ గా మారిపోయింది. చరణ్ తారక్ మీద ఏ సందర్భంలో ఎందుకు దాడి చేస్తాడనే వివరాలు చెప్పలేదు కానీ ఆ సీన్ లో తాను ఉన్నానని ఆ ఎపిసోడ్ చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పడం అంచనాలు పెంచేస్తోంది. ఇక రెండో సంగతి చూస్తే ఓ సన్నివేశంలో రామ్ చరణ్ బ్రిటిష్ సైనికుడిగా కనిపిస్తాడట. కథ ప్రకారం ముందు వాళ్ళ సైన్యంలో ఉంటాడా లేక ఆ యునిఫార్మ్ వేసుకుని వాళ్ళను దెబ్బ తీసే ప్లాన్ చేస్తాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

మొత్తానికి రాజమౌళి స్కెచ్ మాములుగా లేదని అర్థమైతోంది. ఇక తారక్ కు సంబంధించిన న్యూస్ కూడా ఉంది. ఒక టెరిఫిక్ ఫైట్ లో జూనియర్ ఎన్టీఆర్ నిజం పులితోనే ఫేస్ టు ఫేస్ ఎదురుపడే సీన్ ఉందట. దాంతో పోరాడే ఎపిసోడ్ విజువల్ ఎఫెక్ట్స్ తో ప్లాన్ చేసినప్పటికీ ఫస్ట్ కొన్ని షాట్స్ లో నిజం పులినే ఉంటుందట. దీనికి సంబంధించిన అనుమతులు పక్కాగా తీసుకున్నారని తెలిసింది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ ఫీవర్ చాలా త్వరగానే మొదలయ్యేలా ఉంది. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఆర్ఆర్ఆర్ కు సాయి మాధవ్ బుర్రా సంభాషణలు సమకూరుస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp