క్రేజీ కాంబోకి కిక్కిచ్చే పేరు

By iDream Post Jul. 10, 2021, 04:00 pm IST
క్రేజీ కాంబోకి కిక్కిచ్చే పేరు

ఇస్మార్ట్ శంకర్ తో మాస్ లో తన బలాన్ని పెంచుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ తన కొత్త సినిమా దర్శకుడు లింగుస్వామితో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీని షూటింగ్ వేగం పెంచుకునే పనిలో ఉంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ఉస్తాద్ అనే టైటిల్ ని లాక్ చేసినట్టు లేటెస్ట్ అప్ డేట్. ట్యాగ్ కూడా రామ్ ఇమేజ్ కు తగ్గట్టే ఉంటుంది కాబట్టి ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి ఇదే బెస్ట్ ఆప్షన్ గా ఫీలవుతున్నట్టు తెలిసింది. అయితే ఇలాంటి అప్ డేట్ ని ఆషామాషీగా ఇవ్వరు కాబట్టి ఏదైనా గ్రాండ్ ఈవెంట్ లాంటిది ప్లాన్ చేసి అప్పుడు అనౌన్స్ చేస్తారు. ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా తొందరేమీ లేదు.

ఉప్పెన సెన్సేషన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటం విశేషం.నేను శైలజ మేజిక్ మరోసారి రిపీట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. తమిళంలో తన పాత సినిమాకు సంబందించిన ఆర్థిక లావాదేవీలేవో బాకీ ఉండటంతో లింగుస్వామి మీద జ్ఞానవేల్ రాజా ఇక్కడి ఛాంబర్ లో ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి కానీ దాని తాలూకు ప్రభావం ఇప్పుడు షూట్ మీద పడుతున్నట్టు కనిపించలేదు. సికందర్ ఆ తర్వాత పందెం కోడి 2 ఇలా సినిమాకు మధ్య చాలా గ్యాప్ తీసుకుంటున్న లింగుస్వామిని రామ్ ని ఎలా చూపిస్తాడన్నది ఆసక్తికరం

ఇక రామ్ సైతం మరో బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఆశలు పెట్టుకున్న రెడ్ కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది కానీ క్రాక్ మాస్టర్ ల స్థాయిలో ఆడకపోవడం కొంత నిరాశకు గురి చేసింది. అందుకే రీమేక్ ల జోలికి వెళ్లకుండా ఈసారి స్ట్రెయిట్ సబ్జెక్టు అది కూడా మాస్ కథను ఎంచుకోవడం బట్టి చూస్తే రామ్ ఇకపై ఫ్యామిలీ జానర్ వైపు చూస్తాడో లేదో అని డౌట్ గా ఉంది. ఉస్తాద్ అయితే పవర్ ఫుల్ గానే అనిపిస్తోంది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా గతంలో ఈ పేరుతో బ్లాక్ బస్టర్ వచ్చింది. మరి రామ్ కూడా ఈ టైటిల్ కే ఓటు వేస్తాడా లేక కాలం గడిచే కొద్దీ ఇదేమైనా మారుతుందా వేచి చూడాలి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp