రౌడీ బాయ్ సినిమా గురించి క్రేజీ టాక్

By iDream Post Jun. 21, 2021, 01:01 pm IST
రౌడీ బాయ్ సినిమా గురించి క్రేజీ టాక్

అర్జున్ రెడ్డితో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కొత్త సినిమా లైగర్ షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతోంది. గత ఏడాది నుంచి కరోనా వల్ల రెండుసార్లు విపరీతమైన జాప్యానికి గురైన ఈ ప్రాజెక్ట్ మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తుండటం అందులోనూ పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ ని కేటాయించడం లాంటి కారణాలు ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. హిందీ వెర్షన్ కు కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న కారణంగానే ఇటీవలే డబు రతానీ క్యాలెండర్ కోసం హీరో హీరోయిన్ల ఫోటో షూట్ జరిగిందన్న టాక్ కూడా ఉంది.

ఇదిలా ఉండగా థియేటర్లు తెరుచుకునే మార్గం సుగమం అయినప్పటికీ భారీ చిత్రాలకు ఓటిటి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే లైగర్ ని ఓ డిజిటల్ సంస్థ 200 కోట్లకు అడిగిందని ముంబై టాక్. ఇందులో శాటిలైట్, డబ్బింగ్, ఓటిటి, థియేట్రికల్ అన్ని కలిపే ఉంటాయన్న మాట. ఇది నిజంగా మతి పోయే డీల్. ఒకవేళ హైప్ కోసం దీన్ని ప్రచారం లోకి తెచ్చారా లేక లేక నిజంగానే ఎవరైనా అంత మొత్తం ఇస్తామని చెప్పారో అంతు చిక్కడం లేదు. ఇప్పటికైతే ముందు అనుకున్న సెప్టెంబర్ విడుదల దాదాపు అసాధ్యం. షూట్ మొత్తం పూర్తి చేశాక అప్పుడు డేట్ గురించి ఆలోచించాలని లైగర్ టీమ్ ఫిక్స్ అయ్యిందట.

ఇంకో నెల ఆగితే కానీ సినిమా హాళ్ల పరిస్థితి ఎలా ఉండబోతోందనే దాని మీద సరైన స్పష్టత రాదు. దానికి తోడు నిర్మాతలు కూడా తేదీలు చెప్పడానికి ముందు వెనుక ఆడుతున్నారు. ఫస్టు నువ్వంటే నువ్వని ఒకరికొకరు ఎదురు చూసే ధోరణిని పాటిస్తున్నారు. ఇదే అవకాశంగా తీసుకుని ఓటిటిలు దానికి తగ్గట్టు తెలివైన గేమ్ ఆడుతున్నాయి. పే పర్ వ్యూ మోడల్ లో మరికొన్ని సినిమాలు వదిలిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన జీ ఇంకా చేస్తూనే ఉంది. అయినా రెండు వందల కోట్లంటే మాటలా. అన్ని హక్కులు కలిపి అంటున్నారు కాబట్టి సినిమా కనక నిజంగా బాగుంటే ఆ మేరకు వర్కౌట్ చేసుకోవచ్చు కానీ చూడాలి ఇది ఎంతవరకు నిజమో.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp