మైత్రి చెలిమిలో క్రేజీ డైరెక్టర్స్

By iDream Post Aug. 04, 2020, 05:58 pm IST
మైత్రి చెలిమిలో క్రేజీ డైరెక్టర్స్

మొదటి సినిమా శ్రీమంతుడుతో ఇండస్ట్రీ హిట్ సాధించి అందరి దృష్టి తమవైపు ఉండేలా చేసుకున్న నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఆ తర్వాత అదే దూకుడు మరికొంత కాలం సాగించింది. జనతా గ్యారేజ్ తో జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో బ్లాక్ బస్టర్ వేసిన ఈ బ్యానర్ కు రంగస్థలం రూపంలో తిరుగులేని రికార్డు బ్రేకర్ వచ్చి చేరింది. ఈ హ్యాట్రిక్ తర్వాత ఇక తిరుగు లేదనుకున్నారు కానీ ఆ తర్వాతే అసలు బ్రేకులు వచ్చి పడ్డాయి. సవ్యసాచి, అమర్ అక్బర్ అంటోనీ, డియర్ కామ్రేడ్, నాని గ్యాంగ్ లీడర్ ఇలా వరసగా క్రేజీ సినిమాలన్నీ టపా కట్టేశాయి. మధ్యలో వచ్చిన చిత్రలహరి డీసెంట్ సక్సెస్ అందుకోగా గత ఏడాది చివర్లో వచ్చిన మత్తు వదలరా బడ్జెట్ పరంగా లాభాలను ఇచ్చింది.

వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన ఉప్పెన విడుదలకు సిద్ధంగా ఉండగా అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప లాక్ డౌన్ పూర్తిగా సద్దుమణిగాక తిరిగి ప్రారంభం కానుంది. ఇవి కాకుండా ఇతర బాషలలో మోస్ట్ వాంటెడ్ లిస్టు లో దర్శకులను సైతం మైత్రి లాక్ చేసుకుంటోంది. తాజాగా కార్తి ఖైది ఫేం లోకేష్ కనగరాజ్ తో ఒప్పందం చేసుకున్నట్టు ఫిలిం నగర్ టాక్. విజయ్ తో చేసిన అతని కొత్త సినిమా మాస్టర్ రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తోంది. దీని తర్వాత సూపర్ స్టార్ రజనికాంత్ తో కమిట్ అయిన ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కుతుంది. అది పూర్తయ్యాక మైత్రి సంస్థకు చేయబోతున్నట్టు సమాచారం. దీని కన్నా ముందు కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా మైత్రి డీల్ చేసుకున్నట్టు గతంలోనే న్యూస్ వచ్చాయి. దానికి తగ్గట్టే సోషల్ మీడియాలో బర్త్ డేలకు విష్ చేయడం లాంటివి జరిగాయి.

ఇప్పుడీ లోకేష్ కనగరాజ్ చేయబోయే సినిమాలో హీరో ఎవరన్నది మాత్రం తెలియదు. మొత్తానికి మైత్రి దూకుడు చూస్తుంటే చాలా భారీ స్కెచ్ తో ఉన్నట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు బాలేని దృష్ట్యా ఇక్కడ అధికారిక ప్రకటనలు వచ్చేందుకు టైం పడుతుంది. మాములుగా ఎంత పెద్ద బ్యానర్ అయినా కొన్ని ఫ్లాప్స్ రాగానే స్లో అవ్వడం సహజం. కాని దానికి రివర్స్ లో మైత్రి దూకుడు పెంచుతోంది. అందులోనూ పాన్ ఇండియా లెవెల్ లో డిమాండ్ ఉన్న లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్ లను సెట్ చేసుకోవడం అంటే మాటలు కాదు. కేసులు అప్పటికంత పూర్తిగా తగ్గిపోతే ఉప్పెనను దసరా రేస్ లో ఉంచేలా ప్లానింగ్ జరుగుతోంది. ఇక పుష్ప లొకేషన్ ను కేరళ నుంచి పూర్తిగా తెలుగు రాష్ట్రాలకే షిఫ్ట్ చేయబోతున్నారు. రీ స్టార్ట్ అయ్యాక దీనికి సంబంధించి వివరాలు తెలుస్తాయి. రంగస్థలం తర్వాత మూడేళ్ళ గ్యాప్ తో రాబోయే సుకుమార్ సినిమా కావడంతో అంచనాలు కూడా దానికి తగ్గట్టే భారీగా ఉన్నాయి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp