డేట్ లాక్ చేసుకున్న 2 క్రేజీ ప్రాజెక్ట్స్

By iDream Post Aug. 06, 2020, 01:47 pm IST
డేట్ లాక్ చేసుకున్న 2 క్రేజీ ప్రాజెక్ట్స్

బాలీవుడ్ లో క్రేజీ మూవీస్ ఓటిటి డైరెక్ట్ రిలీజులు క్యూ కడుతున్నాయి. జులై నెలాఖరున ఒకేసారి నాలుగు సినిమాలు పలకరించడం మూవీ లవర్స్ కు మంచి విందు భోజనం కలిగించింది. రాత్ అకేలీ హై, శకుంతలాదేవి, లూట్ కేస్, యారా వరసగా వినోదాన్ని పంచాయి. టాక్ మరీ గొప్పగా లేనప్పటికీ ఉన్నంతలో డీసెంట్ గానే ఆకట్టుకున్నాయి. ధియేటర్ దాక వెళ్ళే శ్రమ లేకపోవడంతో అందరూ దాదాపు వీటిని చూశారనే చెప్పాలి. ఈ నెల 12న జాన్వీ కపూర్ గుంజన్ సక్సేనా రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో రెండు ఈ నెల చివరి వారంలో కనువిందు చేయబోతున్నాయి. నెట్ ఫ్లిక్స్ ద్వారా ఆగస్ట్ 21న 'క్లాస్ అఫ్ 83' నేరుగా నెట్ ఫ్లిక్స్ ద్వారా రాబోతోంది.

ఇది హీరో బాబీ డియోల్ కు మొదటి డిజిటల్ డెబ్యూ. ముంబై మాఫియా మీద నిజ జీవిత నవలలు రాసే సుప్రసిద్ధ రచయిత హుసేన్ జైదీ రాసిన పుస్తకం ఆధారంగా ఇది రూపొందుతోంది. సమాజంలో పేట్రేగిపోతున్న అరాచక శక్తుల పట్ల విసిగిపోయిన ఓ పోలీస్ ఆఫీసర్ వాళ్ళను అంతం చేసేందుకు ఏం చేశాడనే కథతో ఇది రూపొందింది. అతుల్ సబర్వాల్ దర్శకత్వం వహించిన క్లాస్ అఫ్ 83కి షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ బ్యానర్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇక రెండో సినిమా మహేష్ భట్ చాలా కాలం తర్వాత డైరెక్ట్ చేసిన 'సడక్ 2'. ముప్పై ఏళ్ళ క్రితం బాక్సాఫిస్ సంచలనంగా నిలిచిన బ్లాక్ బస్టర్ రీమేక్ గా రూపొందిన ఈ సీక్వెల్ లో అందులో హీరోయిన్ గా నటించిన ఆయన కూతురు పూజా భట్ తో పాటు హీరో సంజయ్ దత్ అవే పాత్రలను కొనసాగించబోతుండటం విశేషం.

మెయిన్ లీడ్ గా అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్ చేస్తున్నారు. ఇది ఆగస్ట్ 28న డిస్నీ హాట్ స్టార్ ద్వారా స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కల్ట్ క్లాసిక్ గా రూపొందిన సడక్ ఇన్నేళ్ల తర్వాత కంటిన్యూ కావడం పట్ల ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. కేవలం వారం గ్యాప్ లో రెండు ఇంటెన్స్ డ్రామా ఉన్న హిందీ సినిమాలు రిలీజ్ కావడం విశేషమనే చెప్పాలి. లాక్ డౌన్ దాదాపుగా సడలించిన నేపథ్యంలో సదరు సంస్థలు కూడా టైమింగ్ దానికి తగ్గట్టే షెడ్యూల్ చేస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్ మధ్యాన్నం 12.30, హాట్ స్టార్ సాయంత్రం 7.30కు వరల్డ్ ప్రీమియర్ టైమింగ్స్ గా ఫిక్స్ చేసుకున్నాయి. సెప్టెంబర్ లో కూడా ఇదే తరహా మూవీ ఫెస్టివల్ జరిగేలా ఉంది. మన దగ్గర ఇంత దూకుడు లేదు కాబట్టి ప్రస్తుతానికి వీటితోనే సర్డుకోక తప్పదు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp