త్వరలోనే హౌస్ సందడి షురూ ?

By iDream Post Jul. 29, 2021, 07:20 pm IST
త్వరలోనే హౌస్ సందడి షురూ ?

మిగిలిన బాషలతో పోలిస్తే తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షోకు వచ్చే స్పందన తక్కువే. క్వాలిటీ పార్టిసిపెంట్స్ ని ఎంపిక చేసుకోకపోవడం, వివాదాల కంటే గొడవలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం లాంటి కారణాలు లేకపోలేదు. దాని తోడు ఇప్పటికి నాలుగు సీజన్లు అవుతున్నా ఆల్రెడీ ముగ్గురు యాంకర్లు మారిపోవడం అన్నిటి కన్నా పెద్ద రీజన్. హిందీలో సల్మాన్ ఖాన్ పది సీజన్లు నడిపిస్తే పక్కనే ఉన్న తమిళనాడులో కమల్ హాసన్ ని మార్చే ఆలోచన సదరు ఛానల్ కు అవసరం పడలేదు. మలయాళం కన్నడలోనూ ఇంతే. ఎవరు మొదలుపెట్టారో వాళ్లే కొనసాగించారు. ఎటొచ్చి మన దగ్గరే వచ్చింది ఇలా మారిపోయే చిక్కంతా.

Also Read: రికార్డు దాటలేకపోయిన వకీల్ సాబ్

దీని సంగతలా ఉంచితే బిగ్ బాస్ సీజన్ 5ని ఎవరు హోస్ట్ చేస్తారనే సస్పెన్స్ నిన్నటి దాకా కొనసాగింది. దగ్గుబాటి రానాని ఈ కొత్త వేషంలో చూడొచ్చని ప్రచారం కూడా జరిగింది. కానీ అది నిజం కాదని తనకు వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయని అదంతా అబద్దమని రానానే కొట్టి పారేశాడు. కట్ చేస్తే ఇప్పుడు మూడో సారి మళ్ళీ నాగార్జుననే కంటిన్యూ చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే సభ్యుల ఎంపిక గుట్టుచప్పుడు కాకుండా చేసేశారని, ప్రోమోలు కూడా సిద్ధం చేస్తున్నట్టు వినికిడి. దసరా నుంచి స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలంటే నాగ్ డేట్స్ ఫైనల్ కావాలి

వచ్చే నెల నుంచి జెమినిలో ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో దాన్ని బలంగా ఎదురుకునే పోటీ ఒక్క బిగ్ బాస్ అని స్టార్ మా ఛానల్ నమ్మకం. రియాలిటీ షోల రూపంలో పెద్ద యుద్ధానికి తెరతీయబోతున్న ఇలాంటి ఛానల్స్ వీటిని నిర్వహించడం కోసం సినిమాకు ఏ మాత్రం తీసిపోని బడ్జెట్ ని ఖర్చు పెడుతున్నాయి. అయినా బిగ్ బాస్ 5కు నాగార్జున కంటే బెస్ట్ ఛాయస్ ఇంకొకరు ఉంటారని చెప్పలేం. జూనియర్ ఎన్టీఆర్, నానిలు ఎలాగూ రారు, రానా నో చెప్పేశాడు. విజయ్ దేవరకొండ నా వల్ల కాదని ఎప్పుడో అన్నాడు. సో ఇది వీలైనన్ని ఎక్కువ సీజన్లు నాగార్జునతో నడవడం దాదాపు ఖాయమే

Also Read: భవిష్యత్తు మీద రేపటి ఆశలు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp