చిరు కోసం అజిత్ బ్లాక్ బస్టర్ కథ ?

By iDream Post Aug. 07, 2020, 11:57 am IST
చిరు కోసం అజిత్ బ్లాక్ బస్టర్ కథ ?

అదేంటో ఇక్కడ కథలు చెప్పేవాళ్ళు దొరకడం లేదో ఎందుకొచ్చిన రిస్క్ అని వెనుకడుగు వేస్తున్నారో తెలియదు కానీ మెగాస్టార్ చిరంజీవి వరసగా రీమేకుల మీద మనసు పారేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే లూసిఫర్ గురించిన వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. దర్శకుడిగా సుజిత్ అని ఒకసారి వివి వినాయక్ అని మరోసారి ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఇది పక్కన పెట్టేసి బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తారన్న టాక్ కూడా కొత్తగా పుట్టుకొచ్చింది. వీటి సంగతలా ఉంచితే మెహెర్ రమేష్ కు సైతం చిరు ఓ కమిట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబినేషన్ కోసం ఐదేళ్ల క్రితం 2015లో వచ్చిన అజిత్ బ్లాక్ బస్టర్ మూవీ వేదాళంను పరిశీలిస్తున్నట్టుగా వినికిడి.

నిజానికిది ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలనీ ఒరిజినల్ వెర్షన్ నిర్మాత కం పవర్ స్టార్ ఫ్రెండ్ ఏఎం రత్నం ప్రయత్నించారు కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఆ హక్కులను కూడా ఆయన ఎవరికీ ఇవ్వలేదు. పోనీ డబ్బింగ్ చేస్తారేమో అనుకుంటే అదీ జరగలేదు. తమిళ్ లో మాత్రం ఇది భారీ రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మరోసారి దీని ప్రస్తావన చర్చల్లోకి వస్తోంది. నిజానికి వేదాలం గొప్ప కథేమి కాదు. రొటీన్ కమర్షియల్ డ్రామా. బాషా, సమరసింహారెడ్డి టైపులో సాగుతూ ఫ్లాష్ బ్యాక్ లో సిస్టర్ సెంటిమెంట్ లింక్ అయ్యి ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇలాంటివి మనం చాలానే చూశాం.

అజిత్ ఇమేజ్ వల్ల అక్కడ ఆ రేంజ్ లో ఆడింది కానీ మనవాళ్ళు అంతగొప్పగా ఫీలయ్యే మెటీరియల్ అయితే అంతగా ఉండదు. కొన్ని గూస్ బంప్స్ హీరోయిజం ఎపిసోడ్స్ ఉంటాయి అంతే. మరి చిరంజీవి సీరియస్ గా వేదాలం గురించి ఆలోచన చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఆచార్య షూటింగ్ రీ స్టార్ట్ అయ్యేదాకా ఏ క్లారిటీ వచ్చేలా లేదు. దసరా నుంచి మొదలుపెట్టొచ్చనే మాట గట్టిగా వినిపిస్తోంది. సంక్రాంతి సీజన్ మిస్ అవుతోంది కాబట్టి వచ్చే సమ్మర్ రిలీజ్ కోసం దీన్ని ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ డేట్స్ తో సరిచూసుకుని దాన్ని బట్టి షెడ్యూల్స్ వేస్తారు. ఏదైనా ఇక్కడ కథలే లేనట్టు చిరంజీవి ఇంతలా రీమేక్స్ వెనుక పడటం ఏమిటో

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp