మెగా 'ఆచార్య' ఏం చేస్తాడో

By Ravindra Siraj Feb. 08, 2020, 10:31 am IST
మెగా 'ఆచార్య' ఏం చేస్తాడో

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా షూటింగ్ నిరవధికంగా కొనసాగుతోంది. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ కొణిదెల సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల స్వయంగా పర్యవేక్షించలేకపోతున్నాడట. అందుకే పనులన్నీ పార్టనర్ సమక్షంలో జరుగుతున్నాయని టాక్. ఇదిలా ఉండగా ఇప్పుడీ సినిమా కోసం ఆచార్య అంటే టైటిల్ రిజిస్టర్ చేయడం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఇది గతంలో లీకైన న్యూసే కానీ అప్పుడు గోవిందాచార్య పేరు ప్రచారంలో వచ్చింది.

ఇప్పుడు గోవింద్ ఎగిరిపోయి జస్ట్ సింపుల్ గా ఆచార్య అని నమోదు చేశారు. టైటిల్ క్యాచీగానే ఉంది. గతంలో మూడక్షరల సినిమాలు చిరుకు చాలానే కలిసి వచ్చాయి. హిట్లర్, మాస్టర్ లాంటివి ఫ్యాన్స్ సెంటిమెంట్ గానూ ఫీలవుతూ ఉంటారు. ఇదిలా ఉండగా ఆలయాల్లో జరిగే అవినీతిని ఆధారంగా చేసుకుని కొరటాల శివ ఈ కథను రాసుకున్నాడని ఇప్పటికే ప్రచారంలో ఉంది. అందులోనూ చిరు రెండు పాత్రల్లో కనిపిస్తాడని. రామ్ చరణ్ కూడా క్యామియో తరహాలో ఓ కీలకమైన రోల్ చేస్తున్నాడని ఏవేవో కథనాలు వస్తున్నాయి.

వీటిని సమర్ధించడానికి లేదా ఖండించడానికి యూనిట్ అందుబాటులో లేదు. వచ్చే దసరాకే రిలీజ్ చేయాలనే టార్గెట్ తో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు ఎలాంటి అప్ డేట్స్ రాకపోవచ్చు. హీరోయిన్ గా ఎవరు ఖరారయ్యారనే విషయం కూడా క్లారిటీ లేదు. త్రిష పేరు వినిపించింది కానీ మళ్ళీ ఎలాంటి సౌండ్ లేదు. మరోవైపు అనుష్క కోసం కూడా గట్టిగా ట్రై చేస్తున్నారట. మొత్తానికి ఆచార్యగా మెగాస్టార్ రావడం దాదాపు ఖరారే. అనూహ్యంగా చివరి నిమిషంలో ఏదైనా మార్పు జరిగితే తప్ప అభిమానులు దీనికే ఫిక్స్ అయిపోవడం బెటర్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp