చావు కబురులో ప్రేమ సరాగం

By iDream Post Sep. 21, 2020, 05:46 pm IST
చావు కబురులో ప్రేమ సరాగం

ఆరెక్స్ 100 లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ చవిచూడలేకపోయినా హీరో కార్తికేయ అవకాశాలకు లోటు లేకుండా చూసుకుంటున్నాడు. తమిళ్ లో అజిత్ కొత్త సినిమా 'వలిమై'గా విలన్ గా నటిస్తూ అక్కడా కాలు పెట్టబోతున్నాడు.తెలుగులో అతని తాజా చిత్రం చావు కబురు చల్లగా. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై కౌశిక్ పెగ్గలపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమా టీజర్ ఇవాళ హీరో పుట్టినరోజు సందర్భంగా విడుదల శారు. కాన్సెప్ట్ ఏంటో చూచాయగా చెప్పేశారు.

బస్తీ బాలరాజు(కార్తికేయ) శవాలను మోసుకెళ్లే వాహనంతో బ్రతుకు బండి నడుపుతూ ఉంటాడు. వాడికో అసిస్టెంట్(భద్రం), అమ్మ(ఆమని)ఉంటారు. ఓ అంత్యక్రియల్లో చేతుల మీద వెంట్రుకలు నిక్కబొడుచుకునే స్థాయిలో ఓ అమ్మాయి(లావణ్య త్రిపాఠి)ని చూసిప్రేమలో పడతాడు. ఇక ఆ తర్వాత ఏమైంది, ఈ బాలరాజుకి ఆ బంగారు బొమ్మకు కనెక్షన్ ఎలా కుదిరిందనేదే సినిమా కాన్సెప్ట్ తో కనిపిస్తోంది. చిన్నపాటి వీడియో అయినప్పటికీ లైన్ ని ఇంటరెస్టింగ్ గానే ప్రెజెంట్ చేశారు. ఎక్కువ డీటెయిల్స్ రివీల్ చేయకపోయినా కథ దీని మీద సాగుతుందో క్లియర్ గా క్లూ ఇచ్చేశారు.

90ఎంఎల్ నుంచి మాస్ హీరోగా సెటిల్ కావడానికి గట్టిగా ట్రై చేస్తున్న కార్తికేయ ఇందులో తన బాడీ లాంగ్వేజ్ కి సూటయ్యే పాత్రను ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. అప్పుడప్పుడు తెరమీద కనిపిస్తున్న సీనియర్ నటి ఆమనికి ఫుల్ లెంగ్త్ రోల్ దొరికింది. మన సినిమాల్లో ఇలా చావు బళ్లను నడుపునే హీరో క్యారెక్టర్లతో సినిమా రావడం చాలా అరుదు. ఆ కారణంగా టైటిల్ కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. జెక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి బన్నీ వాస్ నిర్మాత. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. లావణ్య త్రిపాఠి లుక్ ని ఇందులో రివీల్ చేయలేదు. ఇంకొంత భాగం షూటింగ్ బ్యాలన్స్ ఉన్న చావు కబురు చల్లగా విడుదల తేదీ ఇంకా ఫిక్స్ కాలేదు. కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి దీంతో అయినా ఎదురు చూస్తున్న మరో గట్టి హిట్టు కార్తికేయ కొడతాడో లేదో వేచి చూడాలి.

Link Here @ bit.ly/2FZT7xd

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp