కెప్టెన్ గంగవ్వ హంగామా - స్వాతి ఎంట్రీ

By iDream Post Sep. 26, 2020, 12:18 pm IST
కెప్టెన్ గంగవ్వ హంగామా - స్వాతి ఎంట్రీ

ఈ రోజు బిగ్ బాస్ 4లో మరో వీకెండ్ రాబోతోంది. నాగార్జున వస్తాడు కాబట్టి సహజంగానే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇక నిన్న జరిగిన దాంట్లో కూడా హంగామా బాగానే జరిగింది. జైలు నుంచి నియోల్ బయటికి రాగా గంగవ్వ కెప్టెన్ అయ్యింది. ఎన్నడూ లేనంత యాక్టివ్ గా ఆవిడ హౌస్ మేట్స్ ని అనుకరించడం, తనదైన శైలిలో అవసరమైనప్పుడు అదమాయించడం మొత్తానికి కోరుకున్న విధంగా మెల్లగా టర్న్ అవుతున్నట్టు స్పష్టమవుతోంది. తొలిరోజుల్లో పడిన ఇబ్బంది ఇప్పుడు గంగవ్వలో కనిపించడం లేదు. కెప్టెన్ కావడంలో సభ్యులు అధిక శాతం మద్దతు ఇవ్వడంతో ఈజీగానే ఆ పదవి దక్కించేసుకున్నారు.

ఇక మరో వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా జరిగిపోయింది. హీరోయిన్ స్వాతి దీక్షిత్ ని రంగంలోకి దించారు. ఇది నాలుగు రోజుల క్రితమే లీకైపోయింది కాబట్టి ప్రేక్షకులకు పెద్దగా ఎగ్జైట్ మెంట్ అనిపించలేదు కానీ పార్టిసిపెంట్స్ మాత్రం మాస్క్ తో ప్రవేశించిన ఆమెను చూసి ఉత్సాహంతో ముందుకు వచ్చారు. అయితే స్వాతి దీక్షిత్ సినిమాల్లో నటించినప్పటికీ అవి పెద్దగా ఆడినవి కావు. పేరు కూడా రాలేదు. మరి ఆడియన్స్ ఏ మేరకు కనెక్ట్ అవుతారో వేచి చూడాలి. స్వాతి నుంచి కానుక పొందాలంటే ఆమెను ఇంప్రెస్ చేయాలని బిగ్ బాస్ పెట్టిన కండీషన్ కు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు గట్టిగానే చేశారు. నోయెల్, అభిజిత్, అఖిల్ పాటలు పాడారు. అమ్మ రాజశేఖర్, అవినాష్ నవ్వించడంలో సక్సెస్ అయ్యారు. మెహబూబ్ వంద పుషప్ లు చేసి తన కండల ప్రదర్శన చూపించాడు.

ఆఖరికి నోయెల్, అఖిల్, అమ్మ రాజశేఖర్, అవినాష్ లు విజేతలుగా నిలిచారు. వాళ్లకు గిఫ్ట్ గా తనతో పాటు పార్టీ లాంజ్ లో డాన్స్ చేసే అవకాశం ఇచ్చింది స్వాతి. మిగిలినవాళ్లు చూస్తూ ఉండిపోయారు. ఈ విషయంగానే సోహైల్, మెహబూబ్ లు బాగా ఇబ్బందిగా కనిపించారు. ఇలా మిస్ కావడం వల్ల డేంజర్ జోన్ లో ఉంటామనే అనుమానం కాబోలు. ఇక స్వాతి దీక్షిత్ విషయానికి వస్తే బ్రేక్ అప్, జంప్ జిలాని, లేడీస్ అండ్ జెంటిల్ మెన్, చిత్రాంగద సినిమాల్లో నటించింది. ఇవేవి కనీస స్థాయిలో ఆడినవి కాదు. జంప్ జిలానిలో అల్లరి నరేష్ హీరో కాబట్టి అందులో కొంత గుర్తొస్తుంది కానీ ఇంత అవుట్ అఫ్ ఫామ్ హీరోయిన్ ని తీసుకొచ్చిన బిగ్ బాస్ తనతో ఏమేం చేయిస్తాడో చూడాలి. మొత్తానికి ఈ వారంలో అల్లరి బాగానే జరిగింది. డ్రామా ఓవర్ అవుతున్నప్పటికీ రేటింగ్స్ రావాలంటే ఇంత కన్నా వేరే మార్గం లేదు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp