వెంకటేష్ తర్వాత బాలయ్యకు జోడిగా

By iDream Post May. 08, 2021, 11:30 am IST
వెంకటేష్ తర్వాత బాలయ్యకు జోడిగా
అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రితం చూసిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ జంటలను మళ్ళీ తెరమీద చూసుకోవడం అంటే అభిమానులకు అదో నోస్టాల్జిక్ ఫీలింగ్ కలగడం సహజం. 1992లో చంటిలో వెంకటేష్ మీనాలను చూసి మెచ్చుకున్న ప్రేక్షకులు 2014లో దృశ్యంలోనూ చూసినప్పుడు ఎంజాయ్ చేయడం అంత ఈజీగా మర్చిపోగలమా. ఆ మధ్య సరిలేరు నీకెవ్వరులో విజయశాంతి సైతం కం బ్యాక్ ఇచ్చినప్పుడు ఆ సినిమాకు హైప్ రావడంలో ఈ అంశం తోడ్పడింది కూడా. ఇదిలా ఉంచితే బాలకృష్ణ ఫ్యాన్స్ కు త్వరలో ఆ అవకాశం దక్కబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. దాని తాలూకు వివరాలు ఏంటో చూద్దాం.

ప్రస్తుతం అఖండ పూర్తి చేసే పనిలో ఉన్న బాలయ్య తర్వాత గోపిచంద్ మలినేనితో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ఓ కొలిక్కి వస్తోంది. ఎప్పటి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారనేది కరోనా సెకండ్ వేవ్ తగ్గడం మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఘట్టంలో బాలకృష్ణ సరసన మీనా నటించబోతున్నట్టు తెలిసింది. చాలా కీలకమైన ఆ ఎపిసోడ్ లో ఆవిడ కనిపించేది కాసేపే అయినా చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశారట. ఇటీవలే ఆవిడను కలిసి గోపిచంద్ అంగీకారం తీసుకున్నట్టు కూడా చెబుతున్నారు. అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యేదాకా వేచి చూడాలి.

దశాబ్దాల క్రితం ఈ జంట నాలుగు సినిమాలు చేసింది. మొదటిది అశ్వమేథం ఫ్లాప్ కాగా బొబ్బిలి సింహం బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. తర్వాత ముద్దుల మొగుడు, కృష్ణబాబు రెండూ డిజాస్టర్ అయ్యాయి. మొత్తంగా చూసుకుంటే ఆడింది ఒకటే కానీ తెరమీద ఈ జంటకు మంచి మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇద్దరూ కలిసి నటిస్తే అభిమానులకు అంతకంటే కావాల్సింది అంటుంది. అయితే మెయిన్ హీరోయిన్ గా శృతి హాసన్ ని తీసుకున్నట్టు ఇప్పటికే టాక్ ఉన్న నేపథ్యంలో ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్ చేయబోతున్నారా లేక ఇంకేమైనా విశేషం ఉందా  లాంటి వివరాలు తెలియాల్సి ఉంది
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp