ఇంత ప్రేమ అవసరమా బాసూ

By iDream Post Sep. 17, 2020, 11:11 am IST
ఇంత ప్రేమ అవసరమా బాసూ

ఎవరు ఎన్ని చెప్పినా ఏమనుకున్నా బిగ్ బాస్ 4 నత్తనడకన సాగుతున్న మాట వాస్తవం. వీక్ డేస్ లోని ఐదు రోజులను ప్రేక్షకులు పూర్తిగా ఎంగేజ్ అయ్యేలా చేయడంలో మేకర్స్ ఫెయిలవుతున్నారు. ఒక ఎపిసోడ్ పర్వాలేదు అనిపిస్తే మరొకటి నీరసంగా సాగుతోంది. అదిరింది అనే మాట దేనికీ రాకపోవడం ఇక్కడ గమనార్హం. ఇందులో ఉన్నవి రియల్ ఎమోషన్సా కాదా అనేది పక్కన పెడితే ఫైనల్ గా ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేయడం చాలా ముఖ్యం. అలా అని డ్రామా శృతి మించినా కూడా అసలుకే మోసం వస్తోంది. ఇప్పుడు జరుగుతున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ అచ్చం ఇదే తరహాలో ఉంది . మోనాల్ గుజ్జర్ ను వలలో వేసుకోవడానికి అఖిల్, అభిజిత్ పడుతున్న పాట్లు చూపిస్తున్న ఎక్స్ ప్రెషన్లు రాను రాను చాలా కృత్రిమంగా అనిపిస్తున్నాయి.

అవసరానికి మించి ఈ ట్రాక్ సాగతీతకు గురవుతోంది. క్లోజప్ లో పదే పదే వాళ్ళ హావభావాలను చూపించడం, అఖిల్ నిజంగానే దుగ్ధతో రగిలిపోతున్నట్టు బిల్డప్ ఇవ్వడం ఇదంతా సహనానికి పరీక్ష పెడుతోంది. పోనీ కొంతసేపు కానిచ్చి డైవర్ట్ చేస్తే బాగుండేది కానీ పదే పదే అక్కడికే తీసుకెళ్ళడం మైనస్ అయ్యేలా ఉంది. ఇదేమి ప్యూర్ లవ్ స్టొరీ కాదు. సినిమానో సీరియలో అంతకన్నా కాదు. ఒక రియాలిటీ షో. ఏదో యూత్ ని ఆకట్టుకునే ఉద్దేశంతో రిపీట్ మోడ్ లో చూపిస్తున్న ఈ ప్రేమకథను ట్రిమ్ చేయకపోతే ఇబ్బందులు తప్పేలా లేవు. అభిజీత్ తో మోనాల్ మాట్లాడుతున్నప్పుడు అఖిల్ చేస్తున్న యాక్షన్ కొంచెం డోస్ ని మించినట్టే కనిపిస్తోంది. అంత అవసరం లేదని చిన్నపిల్లాడు సైతం చెప్తాడు.

షో చూసేవాళ్ళు అయ్యోపాపం అని సానుభూతి చూపించే సీన్ కూడా అక్కడ లేదు. మరి అలాంటప్పుడు ఈ డూప్లికేట్ ప్రేమదేశం స్కిట్ ని ఇంతగా ఎందుకు పొడిగిస్తున్నారో అర్థం కాదు. అఖిల్ కూడా జీవితంలో సర్వం కోల్పోబోతున్నట్టు ముభావంగా ఉండటం మిగలిన హౌస్ మేట్స్ తోనే కాదు ఓట్లు వేయాల్సిన ప్రేక్షకులతోనూ మైనస్ మార్కులు తెప్పించేలా ఉంది. మోనాల్ అభిజీత్ ల మధ్య వ్యవహారం కూడా ఏమంత ఆసక్తిగా లేదు. ఏదో పార్టిసిపెంట్స్ తో డ్యాన్సులు గట్రా వేయించి ఎంటర్ టైన్ చేశారు కానీ లేదంటే ఇంకా బోరింగ్ గా ఉండేది. మొత్తానికి ఎప్పటికప్పుడు షో సాగుతున్న తీరుని బిగ్ బాస్ రివ్యూ చేసుకుని మార్పులు చేసుకోకపోతే శని, ఆదివారాలు తప్ప మిగిలిన రోజుల్లో రేటింగ్స్ డల్ గా వచ్చే ప్రమాదం ఉంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp