పాల కోసం సభ్యుల రగడ - ముగ్గురు అవుట్

By iDream Post Dec. 02, 2020, 10:33 am IST
పాల కోసం సభ్యుల రగడ - ముగ్గురు అవుట్

కౌంట్ డౌన్ మొదలయ్యింది. బిగ్ బాస్ 4 ఫినాలేకు దారులు తెరుచుకున్నాయి. ఈ నెలలోనే షో ముగియనుండటంతో ప్రేక్షకులు కూడా దీని మీద ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్న టికెట్ టు ఫినాలే పేరుతో యుద్ధభేరి మ్రోగించేశారు. ఉన్న ఏడుగురిలో ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారు సస్పెన్స్ కి మెల్లగా తెరలు వీడుతున్నాయి. టాస్కుల కన్నా ముందు ఇతర సంగతులు చూస్తే మొన్న దిమాక్ తో ఆడలేదు దిల్ తో ఆడినట్టు మోనాల్ అన్న మాటలను ఉద్దేశించి అఖిల్ మళ్ళీ తనలో కమల్ హాసన్ ని బయటికి తీశాడు. మోనాల్ కూడా వచ్చి రాని తెలుగులో ఏదేదో చెప్పుకుంది. మోనాల్ ని నామినేట్ చేసిన విషయంలో సోహైల్ అఖిల్ మధ్య కాసేపు పంచాయితి జరిగింది.

ఇక అసలైన టాస్కు విషయానికి వస్తే ఫినాలే మెడల్ కాన్సెప్ట్ ని తెచ్చాడు బిగ్ బాస్. దీన్ని సాధిస్తే నేరుగా ఫినాలే వీక్ లో ప్రవేశిస్తారని ఊరించాడు కూడా. ఇందులో భాగంగా ఈసారి ఓ ఆవు బొమ్మను తీసుకొచ్చిపెట్టారు. అందరికీ మిల్క్ స్టేషన్లు ఇచ్చారు. ఆవు నుంచి అంబా అని సౌండ్ వచ్చినప్పుడంతా సభ్యులు పరిగెత్తుకుని వచ్చి దాన్నుంచి వచ్చే పాలను తమ బాటిల్స్ లోకి నింపుకోవాలి. ఎవరి దగ్గరైతే తక్కువ బాటిల్స్ పాలు ఉంటాయో వాళ్ళు టాస్క్ నుంచి తప్పుకోవాలి. ఎక్కువ పాలు ఉన్న టాప్ 4 లెవెల్ 2కి వెళ్తారు. ఇదీ ఆటకు పెట్టిన నిబంధనలు. దాని కోసం మీ ఇష్టం వచ్చినట్టు చేయమని చెప్పడమే అసలు ట్విస్ట్.

కానీ ఇక్కడే అసలు రచ్చ మొదలయ్యింది. ఊహించిన దాని కన్నా ఓవర్ గా హౌస్ మెంబెర్స్ పోటీపడి మరీ ఈ ఆవు టాస్కుని కలగాపులగం చేసేశారు. ఒకదశలో ఇది లిమిట్స్ దాటేసింది. అవినాష్ చేసిన అతి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అరుచుకుని కొట్టుకుని నానా రభస చేశారందరూ. అవినాష్ ని మోనాల్ తన్నడం, అతనూ కెమెరా ముందుకు వెళ్లి పదే పదే బిల్డప్ లు ఇవ్వడం ఎక్కువయ్యింది. పాలలో నీళ్లు కలపడంతో ఫస్ట్ రౌండ్ కే అవుట్ అయ్యాడు. అరియనా, మోనాల్ లు గెలవలేకపోయారు. ఫైనల్ గా లెవెల్ 2కి అఖిల్, సోహైల్, అభిజిత్, హారికలు ఎంపికయ్యారు. ఇవాళ పూలతో ఇలాంటి టాస్కే ఇవ్వబోతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp