సరదా ఆటలతో అల్లరి - ఇంటికెళ్లిపోయిన లాస్య

By iDream Post Nov. 23, 2020, 11:56 am IST
సరదా ఆటలతో అల్లరి - ఇంటికెళ్లిపోయిన లాస్య

మొన్నే ప్రచారంలోకి వచ్చినట్టు బిగ్ బాస్ 4 నుంచి లాస్య ఎలిమినేట్ అయ్యింది. రెండు రోజులగా ఇదే వార్త సోషల్ మీడియాలో బాగా హై లైట్ అయ్యింది. ఓట్ల పేరుతో మరోసారి మోనాల్ ని కాపాడి తమ ఉద్దేశాన్ని స్పష్టం చేసినట్టయ్యింది. వీకెండ్ లాస్ట్ ఎపిసోడ్ లో భాగంగా నాగార్జున ఒక్కొక్కరిని కాపాడుతూ వచ్చి ఫైనల్ గా అరియనా, లాస్యలను డేంజర్ జోన్ లో పెట్టారు. అప్పటికే మ్యాటర్ తెలిసిపోయింది కాబట్టి ప్రేక్షకులకు అంత ఎగ్జైట్మెంట్ అనిపించలేదు కానీ మరీ ఎక్కువ డ్రామా లేకుండా సింపుల్ గా టెన్షన్ పెట్టి లాస్య పేరుని చెప్పారు. ఎప్పటిలాగా ఓవర్ డ్రామా లేకుండా లాస్యతో పాటు ఇతర పార్టిసిపెంట్స్ కూడా నవ్వుతూ సాగనంపారు.

ఇక లాస్య స్టేజి మీదకు వచ్చాక కాసేపు హౌస్ జర్నీని ప్రదర్శించారు. టీవీలో సభ్యులతో మాట్లాడించారు. తన అభిప్రాయంలో సోహైల్, అభిజిత్ టాప్ 2 అని చెప్పింది లాస్య. ఆ తర్వాత ఒక్కొక్కరి గురించి తన అభిప్రాయాలను నాగ్ తో షేర్ చేసుకుంది. అవినాష్ కో మినీ క్లాస్ తీసుకుని మోనాల్ ని ఎక్కువ కన్ఫ్యూజ్ కావొద్దని హితవు పలికింది. అరియనాను బోల్డ్ గా మాట్లాడే విషయంలో కొన్ని సూచనలు చేసింది. సోహైల్ కోపం గురించి చెబుతూనే వెంటనే కూల్ అవ్వడం గురించి మెచ్చుకుంది. అఖిల్ కు కూడా ఇదే తరహాలో సలహాలు ఇచ్చి హారిక కంపెనీ బాగుంటుందని కితాబు ఇచ్చింది.

దీనికన్నా ముందు జరిగిన మిగిలిన సంగతులు చూస్తే వెరైటీ గేమ్స్ ఆడించారు నాగ్. టీవీలో చూపించే క్లూస్ ఆధారంగా పాటలు గుర్తించే టాస్కు ఇచ్చి హారిక, అరియనాలను చెరొక టీమ్ గా విడగొట్టారు. ఇందులో భాగంగా గాజువాక పిల్లా కు డాన్స్ చేశారు అవినాష్ అండ్ గ్యాంగ్. ఈ సందర్భంగా పాణి గ్రహణం గురించి కామెడీ చేసిన నాగార్జున మోనాల్ అవినాష్ లకు పెళ్లయినట్టేనని పంచ్ వేశారు. ఇలా ఆడుతూ పాడుతూ ఫైనల్ గా హారిక టీమ్ నెగ్గింది. తర్వాత లూడో గేమ్ లో అరియనా బృందం గెలిచింది. దీంట్లో వెరైటీ చేష్టలతో హాస్యం పండించారు. ఇలా మొత్తానికి లాస్య అవుట్ తో బిగ్ బాస్ వారాంతం ముగిసింది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp