సొహైల్ త్యాగం - మెడల్ అఖిల్ సొంతం

By iDream Post Dec. 05, 2020, 12:17 pm IST
సొహైల్ త్యాగం - మెడల్ అఖిల్ సొంతం

ఫైనల్ కు దగ్గర పడుతున్న బిగ్ బాస్ 4 నిన్నటితో తొంభై ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. వందతో ముగిస్తారా లేక అటుపై ఇంకొంత సాగదీస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇవాళ వీకెండ్ కావడంతో నాగార్జున ఎంట్రీతో ఆట ఏదైనా కొత్త మలుపు తీసుకునే అవకాశం ఉంది. అంతే కాదు గేమ్ ఎప్పుడు క్లోజింగ్ కు వస్తుందా అనే సూచనలు ఇచ్చే ఛాన్స్ లేకపోలేదు. ఇక అసలు విషయానికి వస్తే ఫినాలే మెడల్ కోసం ఉయ్యాల దిగకుండా అఖిల్ సోహైల్ లు గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. వీళ్ళు పడుతున్న తంటాలు మాములుగా లేవు. కాసేపు కామెడీ చేయడం కోసం అవినాష్ అరియనాలు ఎన్నెన్నో జన్మల బంధం పాటను అందుకోవడం చుక్కలు చూపించింది.

నిన్న కొన్ని ట్విస్టులు కూడా జరిగాయి. సొహైల్ అఖిల్ లో ఒకరు డ్రాప్ అవ్వడం గురించి అభిజిత్ వచ్చి ఇద్దరికీ ఏదైనా నిర్ణయం తీసుకోండని చెప్పాడు. దీంతో అఖిల్ ఎమోషనల్ ట్రాప్ తో పడగొట్టాడు. అమ్మ, అన్నల సెంటిమెంట్ కార్డు వాడాడు. దీంతో సోహైల్ నిలువునా కరిగిపోయి ఉయ్యాల దిగేందుకు డిసైడ్ అయిపోయాడు. అయితే అఖిల్ మళ్ళీ వద్దు అని వారించడం, బిగ్ బాస్ తర్వాత ఏం చెబుతాడో అని భయాన్ని వ్యక్తం చేయడం ఇదంతా ఓ రేంజ్ డ్రామాలా నడిచింది. మళ్ళీ తన కుటుంబ సభ్యుల కార్డు వాడిన అఖిల్ తాను భోరుభోరున ఏడవటమే కాదు సోహైల్ ని కూడా కన్నీటి వర్షంలో ముంచేశాడు.

ఫైనల్ గా అఖిల్ కోసం సోహైల్ చేసిన త్యాగం అభినందన సినిమాలో శరత్ బాబు రేంజ్ లో కనిపించింది. అభిజిత్ దగ్గర ఇద్దరూ మరోసారి ట్యాప్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత అఖిల్ ఫినాలే మెడల్ కు అర్హత సాధించి టాప్ 5లో చోటుని ఖరారు చేసుకున్నాడు. ఇదంతా ఒక ఎత్తయితే బిగ్ బాస్ మరోసారి సభ్యుల మధ్య రచ్చకు దారి తీసే టాస్కులకు శ్రీకారం చుట్టాడు. ఎప్పటిలాగే ర్యాంకుల ప్రహసనం పెట్టాడు. ఇందులో సోహైల్ 1 కాగా అభిజిత్ 6వ స్థానంలో చివరిగా నిలిచాడు. అవినాష్ బుర్రకథ కూడా బాగానే సాగింది. ఇక ఇవాళ నాగ్ ప్రవేశంతో హౌస్ లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp