యంత్రాలే విజేతలు - నోయలే జైలుపాలు

By iDream Post Sep. 25, 2020, 02:58 pm IST
యంత్రాలే విజేతలు - నోయలే జైలుపాలు

మూడు రోజుల నుంచి సాగదీస్తున్న రోబోస్ vs హ్యుమన్స్ టాస్క్ నిన్నటితో ముగిసింది. అరుపులు, ఏడ్పులు, ఓవర్ యాక్షన్లు, బూతులు యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ వీటి కోసమే ఈ షో చూస్తున్న వాళ్లకు మాత్రం పూర్తి సంతృప్తి కలిగిస్తూ మొత్తానికి వీకెండ్ కు దగ్గరగా వచ్చేసింది. అనూహ్యంగా రోబో టీమ్ విన్నర్ గా నిలిచింది. ఈ క్రమంలో పలు ఆసక్తికరమైన సంఘటలను కూడా జరిగాయి. ఛార్జింగ్ కోసం అవినాష్ చాలా తెలివిగా అమ్మ రాజశేఖర్ ను మోసం చేయడం, దానికి బదులుగా ఇక జన్మలో అతన్ని నమ్మనని అమ్మ శపథం చేయడం ఫన్నీగా సాగింది. గంగవ్వ తన ఛార్జింగ్ కోసం ఆపోజిట్ టీమ్ కు ఫుడ్ ఆఫర్ చేసి పని కానిచ్చేసుకుంది. ఉదయాన్నే వాష్ రూమ్ ప్లస్ నీళ్ల కోసం చిన్నపాటి గొడవలు కూడా జరిగాయి.

గేమ్ అంతా అయిపోయే లోపు అభిజిత్, గంగవ్వ ఇద్దరూ చెరీ కొంత ఛార్జింగ్ మిగుల్చుకోవడంతో వాళ్ళ బృందాన్ని ఫైనల్ విజేతలుగా బిగ్ బాస్ ప్రకటించారు. అయితే హ్యుమన్ టీమ్ కూడా సమానంగా కష్టపడ్డారనే ఉద్దేశంతో వాళ్లకూ బాస్ నుంచి కాంప్లిమెంట్స్ అందటం గమనార్హం. ఒకరినొకరు హగ్ చేసుకుని తమ సంతోషాన్ని పంచుకుంది రోబో టీమ్. ఇక్కడితో దీని కథ సుఖంతమయ్యింది. షో మొదటి నుంచి కాస్త తడబడుతూ భయపడిన గంగవ్వ తనదైన శైలిలో ఫామ్ లోకి వచ్చేసింది. మోనాల్, సుజాతా, అవినాష్ లతో వ్యవహరించిన తీరు హైలైట్ గా నిలిచింది. ఇక ఈ మొత్తం ఆటలో బెస్ట్ అండ్ వరస్ట్ ఎవరు ఆడారో సభ్యులను బాస్ గుర్తించామన్నాడు. గంగవ్వ, అభిజిత్, హారిక, అవినాష్ లకు టాప్ రేటింగ్ దక్కింది. నోయెల్, అమ్మ రాజశేఖర్ హ్యూమన్స్ లో తమను తామే బ్యాడ్ పెర్ఫార్మర్స్ గా చెప్పుకోగా అధిక శాతం పార్టిసిపెంట్స్ దివి వైపే వేలెత్తి చూపించారు.

ఇక ఫైనల్ గా వరస్ట్ ట్యాగ్ తో నోయెల్ జైలు పాలు కావాల్సి వచ్చింది. దాంట్లో వాష్ రూమ్ వసతి ఉన్నప్పటికీ మూడు పూటలా కేవలం రాగి సూప్ మాత్రమే ఇవ్వనుండటంతో బయటికి వచ్చేదాకా అతనికి యమా సంకటం ఖాయం. లోపల పాటలు పాడుకోవడం దానికి బయటి నుంచి అమ్మ రాజశేఖర్, దివి తదితరులు కంపెనీ ఇస్తూ ఎంజాయ్ చేయడం మొత్తానికి ఓ మాదిరిగా షోను ముగించారు. ఇక ఇవాళ జరగబోయేది మినహాయిస్తే రేపు నాగార్జున ఎంట్రీ ఉంటుంది కాబట్టి బయటికి ఎవరువస్తారనే ఊహాగానాలు మొదలైపోయాయి. మెహబూబ్, అఖిల్, అభిజిత్, సుజాతా ఇలా పేర్లైతే వినిపిస్తున్నాయి కానీ రేపటి సాయంత్రానికి ఏదో ఒక రూపంలో వచ్చే లీకుల ద్వారా క్లారిటీ రావొచ్చు. గత రెండు వారాలుగా జరిగింది అదే కాబట్టి రేపు వచ్చే పేరును కూడా నమ్మొచ్చు. ఒకరు బయటికి వెళ్తారా లేక ఇద్దరా అనేది వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp