నోయెల్ ఫేర్ వెల్ - కొత్త కెప్టెన్ అరియనా

By iDream Post Oct. 30, 2020, 11:20 am IST
నోయెల్ ఫేర్ వెల్ - కొత్త కెప్టెన్ అరియనా

ఊహించని విధంగా నిన్న అనారోగ్య కారణాల వల్ల నోయెల్ బిగ్ బాస్ 4 హౌస్ నుంచి బయటికి వచ్చేశాడు. తను వెళ్లిపోవడం గురించి ఉదయం నుంచే స్టార్ మా ప్రోమోస్ లో చూపించేయడంతో సస్పెన్స్ షాక్ లాంటివేవీ కలగలేదు. హౌస్ మేట్స్ మాత్రం ముందు బాగా ఎమోషనల్ అయ్యారు. కీళ్ల నొప్పులు తీవ్రమై(అర్థటైటిస్) ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకునే జబ్బు కాకపోవడంతో తప్పనిసరై హాస్పిటల్ కు షిఫ్ట్ చేస్తున్నట్టు బిగ్ బాస్ ప్రకటించాడు. అయితే త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని మళ్ళీ అడుగు పెట్టాలని చెప్పడంతో రిటర్న్ వచ్చే అవకాశాలు మెరుగయ్యాయి. ఇది తెలియగానే సభ్యుల మొహాల్లో ఆనందం తొంగిచూసింది. అందరికంటే ఎక్కువ హారిక ఎమోషనల్ అయ్యింది.

దీనికన్నా ముందు కొత్త కెప్టెన్ కోసం నిన్న కొత్త టాస్కులు మొదలయ్యాయి. సరుకుల విషయంలో రేషన్ మేనేజర్ గా ఉన్న అరియనా అంతకు ముందు అదే జాబ్ చేసిన మెహబూబ్ తో గొడవకు దిగింది. అభిజిత్ మోనాల్ ని టార్గెట్ చేసి తన నడకను ఒంటెతో పోలుస్తూ కాసేపు కామెడీ చేసే ప్రయత్నం చేశాడు. ఈ బాడీ షేమింగ్ కాన్సెప్ట్ అంతగా పండలేదు. ఈసారి కెప్టెన్సీ ఓన్లీ ఫర్ లేడీస్ ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ఎంపిక చేసే బాధ్యత మగాళ్లదే. ఇందులో భాగంగానే కీ బాక్స్ గేమ్ పెట్టారు. మొదట గెలిచిన అఖిల్ వెంటనే జై మోనాల్ అనేశాడు. ఈ అవకాశాన్ని వాడుకుని మోనాల్ హారికను రేస్ లో నుంచి తప్పించేసింది.

సెకండ్ రౌండ్ లో మెహబూబ్ కీ దక్కించుకోగా అరియనాకు ఓటేశాడు. లాస్యను కెప్టెన్ కాకుండా చేయమని కోరడంతో ఆమె యాపిల్ కోసేసి తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. మూడో విడతలో అమ్మ రాజశేఖర్ కు కీ దక్కగా అతను కూడా అరియనాకే ఇచ్చాడు. దీంతో లాస్య మీద అందరూ ప్లాన్ వేసి గీసిన స్కెచ్ వర్కవుట్ అయ్యి తనకు కిరీటం దక్కలేదు. ఇక రేషన్ మేనేజర్ గా మోనాల్ ని నియమించింది అరియనా. దీనికి అమ్మ రాజశేఖర్ తెగబాధ పడిపోయి అవసరానికి మించి నానా ఓవర్ యాక్షన్ చేసి చిరాకు పుట్టించారు. ఒకదశలో అరియనా అన్నం మానేసి ఏడుస్తూ కూర్చుంది. ఇలా కిందామీదా పడుతూ మొత్తానికి మమ అనిపించేశారు. రేపే ఎలిమినేషన్ ఎపిసోడ్ కాబట్టి ఇవాళ ఎలా ఉండబోతోందో చూడాలి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp