దేవి అవుట్ : గేమ్ లో ట్విస్ట్

By iDream Post Sep. 28, 2020, 11:46 am IST
దేవి అవుట్ : గేమ్ లో ట్విస్ట్
మొన్నటి నుంచి ప్రచారంలో ఉన్నట్టుగానే దేవి నాగవల్లి బిగ్ బాస్ 4 నుంచి బయటికి వచ్చేసింది. అంతకు ముందు మెహబూబ్ పేరు గట్టిగా వినిపించింది కానీ అనూహ్యంగా శనివారం సాయంత్రం నుంచి సీన్ రివర్స్ అయ్యింది. ఓట్ల మధ్య ఉన్న చిన్న తేడా జాతకాలను మార్చేసింది.ఇద్దరి మధ్య తేడా ఒక్క శాతం కన్నా తక్కువే ఉన్నప్పటికే మెహబూబ్ కే సోషల్ మీడియా మద్దతు పలకడంతో దేవికి గుడ్ బై తప్పలేదని ఇన్ సైడ్ టాక్. అయితే ముందస్తు ఒప్పందం ప్రకారం టీవీ9 మూడు వారాలే పాల్గొనేలా దేవికి అనుమతిచ్చిందని ఒకవేళ నిజంగా తనకు ఓట్లు ఎక్కువ వచ్చి ఉన్నా ప్రేక్షకులకు అది తెలుసుకునే అవకాశం లేదు కాబట్టి ఇలా జరిగిపోయిందని తన అభిమానుల వాదన. 

ఏది ఏమైనా చాలా యాక్టివ్ గా ఉన్న దేవి నాగవల్లిని బయటికి పంపేయడం కొంత ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. స్ట్రాంగ్ లేడీగా ఇప్పటికే సభ్యుల్లో తనకు మంచి ఇంప్రెషన్ ఉంది. టీవీ యాంకర్ గా ఉన్న అపారమైన అనుభవం, వ్యక్తిగత జీవితంలో సవాళ్ళను ఎదురుకుని నిలిచిన వైనం మంచి కాంపిటీషన్ ఇచ్చేలా చేసింది. సో ఈ వారం సోషల్ మీడియా స్టార్స్ అందరూ సేఫ్ అయిపోయారు. ముఖ్యంగా మెహబూబ్ మొహంలో కొండంత రిలీఫ్ కనిపించింది. ఇక మిగిలినవాళ్ళతో దేవి చాలా ఎమోషనల్ గా ఫేర్ వెల్ తీసుకుంది. వాళ్ళ మీద తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పిన దేవి ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇందులో నిజాయితి స్పష్టంగా

కనిపించింది. అరియానా తీవ్ర కన్నీటి పర్యంతమయ్యింది. 

అక్కయ్యగా భావించే తను వెళ్ళిపోవడం ఎంత లోటో వివరించి చెప్పింది. మెహబూబ్ సైతం తనకో తెలుగు పాట నేర్పిస్తానని ఇచ్చిన మాట తప్పుతారా అని అడిగేశాడు. అరియానాను వచ్చే వారం ఎలిమినేషన్స్ నుంచి దేవి కాపాడేసింది. ఇలా వీకెండ్ ఎపిసోడ్ పూర్తిగా దేవికే ఇచ్చేశారు. ఇక నాగార్జున తనదైన శైలిలో సాగనంపడంతో పాటు దానికన్నా ముందు యథావిధిగా ఎప్పటి తరహాలోనే పార్టిసిపెంట్స్ ని రివ్యూ చేశారు. ఈ రోజుతో మరో వీక్ స్టార్ట్ అయ్యింది. ఒకపక్క ఐపిఎల్ తీవ్రమైన పోటీ ఇస్తున్న నేపథ్యంలో బిగ్ బాస్ షో మరింత రసవత్తరంగా మారాల్సి ఉంది. క్రమంగా అది జరుగుతున్నట్టు కనిపిస్తోంది. దానికి తోడు ఈ మధ్య అరుచుకోవడాలు, రాజకీయాలు హౌస్ లో ఎక్కువైపోయాయి. షోని నిలబెట్టేది కూడా ఇవే. చూద్దాం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp