హద్దులు దాటిన బేబీస్ - చాక్లెట్స్ చేసిన రచ్చ

By iDream Post Oct. 29, 2020, 12:18 pm IST
హద్దులు దాటిన బేబీస్ - చాక్లెట్స్ చేసిన రచ్చ

కావాలని ప్లాన్ చేసిందో లేక పార్టిసిపెంట్స్ ఒళ్ళు మరిచి ఆటలో లీనమవుతున్నారో కానీ మొత్తానికి బిగ్ బాస్ 4 అప్పుడప్పుడు బాగా శృతి తప్పుతోంది. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా మొన్న మొదలుపెట్టిన బీబీడే కేర్ టాస్క్ కొందరి ఓవరాక్షన్ వల్ల పీక్స్ కు చేరుకుంది . ఫ్యామిలీ ఆడియన్స్ చూసేందుకు ఇబ్బంది పడేలా ఒకరిని మించి మరొకరు ఓ రేంజ్ లో రెచ్చిపోవడంతో ఒకదశలో వెగటు పుట్టేలా చేశారు. ఇదంతా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికని ఈ షో అభిమానులు సమర్దించుకోవచ్చు గాక. అంతమాత్రాన మరీ ఈ స్థాయిలో డ్రామాను హద్దులు దాటించడం మాత్రం ఆలోచించాల్సిన విషయం. సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

ఇక విషయానికి వస్తే అందరిలోకి బాగా హై లైట్ అయ్యింది అమ్మ రాజశేఖర్, హారికలు. పరస్పరం టీజ్ చేసుకుంటూ ఆడుకుంటూ తాము ఏం చేస్తున్నామన్న విచక్షణ మరిచిపోయారు. చాక్లెట్స్ ని తన చెడ్డీలో వేసుకుని పరిగెత్తిన హారికను రాజశేఖర్ పట్టుకుని దొర్లించి వాటిని తీసుకుని నేలకేసి విసిరికొట్టడం ఎంత సరదా అనుకున్నా ఓవర్ అయ్యింది. ఈ చర్యను సమర్ధించుకునేందుకు మాస్టర్ గారు చెప్పిన మాటలు వింటే ఎవరైనా ఆహా అనాల్సిందే. దీని గురించి కాసేపు వాదోపవాదాలు జరిగాయి. తప్పు ఒప్పుల గురించి వీళ్ళందరూ చర్చించుకుంటూ ఉంటే భలే కామెడీగా అనిపించింది. అభిజిత్, అరియానా, మోనాల్, లాస్యలు కూడా ఇందులో పాల్గొన్నారు.

ఈ తతంగాన్ని చాలా సేపు సాగదీశారు. హారిక ఇంగ్లీష్ లో క్లాస్ పీకడం ఇంకో లెవెల్ పరాకాష్ట. ఇంత జరిగినా ఆ అమ్మాయి చాక్లెట్ల దొంగతనం అక్కడితో విడిచిపెట్టకపోవడం కొసమెరుపు. ఈ ఎపిసోడ్ వల్ల మిగిలిన అంశాలు అంతగా హై లైట్ కాలేకపోయాయి. ఇంకో రెండు రోజుల్లో హౌస్ నుంచి ఎవరు బయటికి వెళ్తారో వచ్చే ఎపిసోడ్ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టే లిస్టులో ఉన్న వాళ్ళు ఎవరి కెపాసిటీకి తగ్గట్టు వాళ్ళు జీవించేస్తున్నారు . ఇవాళ రేపటితో ఈ వారం టాస్కులు పూర్తవుతాయి. వీకెండ్ హోస్ట్ గా సమంతానే వస్తుందా అనే చర్చ జరుగుతుండగా నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ ముగించుకునే పనిలో ఉన్నారని ఆయనే వచ్చినా ఆశ్చర్యం లేదని మరో టాక్.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp