అవినాష్ సేఫ్ రిస్కులో అఖిల్ - వెరైటీ ట్విస్టులు

By iDream Post Nov. 25, 2020, 11:36 am IST
అవినాష్ సేఫ్ రిస్కులో అఖిల్ - వెరైటీ ట్విస్టులు

కొత్త నామినేషన్ల పర్వంలో బిగ్ బాస్ 4 హౌస్ లోని పార్టిసిపెంట్స్ స్పీడ్ పెంచుతున్నారు. నోయెల్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రావొచ్చనే సంకేతాలు ఎక్కువ కావడంతో దానికి తగ్గట్టే తమ గేమ్ ని స్ట్రాంగ్ చేసుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. మహా అయితే ఇంకో పాతిక రోజుల్లో కథ క్లైమాక్స్ కు వచ్చేస్తుంది. ఇక నిన్నటి విషయానికి వస్తే అరియనా కన్నీళ్లు పెట్టుకోగా అవినాష్ వచ్చి ఇక్కడ ఆడకపోతేనే సేఫ్ అవుతామంటూ కామెంట్స్ చేయడం విశేషం. హారిక కృతజ్ఞత లేకుండా అఖిల్ ని నామినేట్ చేయడంతో మోనాల్ తెగ ఫీలయిపోయింది. అరేబియా సముద్రాన్ని నింపుకున్న కళ్ళు మరోసారి వర్షించడంతో హారిక ఓదార్చే ప్రయత్నం చేసింది.

మోనాల్ సమస్య అభిజిత్ సేవ్ కావడం వల్ల వచ్చింది. ఫైనల్ గా హారిక సారీ చెప్పే దాకా మోనాల్ ఏడుపు మొన్న హైదరాబాద్ వరదలా పారుతూనే ఉంది. అసలు ట్విస్ట్ ఏంటంటే అఖిల్ కు ఇంకా మోనాల్ పై కోపం తగ్గకపోవడం. దీని గురించి సోహైల్ దగ్గర వాపోయాడు అఖిల్. ఇదంతా ఒక ఎత్తు అయితే అర్ధరాత్రి స్విమ్మింగ్ పూల్ దగ్గర మోనాల్ అభిజిత్ లు మరోసారి నువ్వే కావాలి సినిమా రేంజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. పరస్పరం తల్లితండ్రులను పొగిడేసుకున్నారు. అవినాష్ ఎలిమినేటి అవుతాడనే మీనింగ్ లో సోహైల్ పంచులు వేయడం పేలింది. ఇక బిగ్ బాస్ కొత్తగా ఏవిక్షన్ పాస్ ని ప్రవేశపెట్టాడు.

నామినేట్ అయిన మెంబర్స్ ఈ ఫ్రీ పాస్ ఉపయోగించుకుని కష్టపడితే సేఫ్ కావొచ్చని చెప్పాడు. అందులో భాగంగానే జెండాల పోటీ జరిగింది. వీటి సేకరణలో అఖిల్ అత్యధికంగా 35 జెండాలాతో విన్నర్ గా నిలవగా అరియనా 17, అవినాష్ 28, మోనాల్ 20 దక్కించుకున్నారు. దీంతో లెవెల్ 2కి అఖిల్, అవినాష్ లు వెళ్లారు. నెక్స్ట్ పూల దండల టాస్కు ఇచ్చారు ఇద్దరికీ. కొన్ని మలుపుల తర్వాత ఆ ఫ్రీ పాస్ ని అవినాష్ గెలుచుకున్నాడు. కానీ ఈ రెండు వారాల్లో దాన్ని ఒకసారి మాత్రమే వాడాలనే ట్విస్ట్ ఇచ్చారు. షాక్ తిన్న అఖిల్ దీని గురించి మళ్ళీ సోహైల్ దగ్గర వాపోయాడు. ఇవాళ ఏదో దెయ్యం ట్విస్టు ఉన్నట్టు ప్రోమోలో చూపించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp