సినిమాలకు అసలు ఛాలెంజ్ ముందుంది

By iDream Post May. 13, 2021, 12:30 pm IST
సినిమాలకు అసలు ఛాలెంజ్ ముందుంది
కనివిని ఎరుగని రీతిలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలోనే విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఎప్పుడు సెలవు తీసుకుంటుందో అంతు చిక్కడం లేదు. మరోవైపు దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండానే ఎవరికి వారు నిర్ణయాలు తీసుకున్నారు. ఇక సినిమా పరిశ్రమ గురించి చెప్పేదేముంది. ఇక్కడా వందల కేసులు నమోదవుతున్నాయి. సెలబ్రిటీలు త్వరగా నెగటివ్ లోకి వచ్చేస్తున్నారు కానీ కిందిస్థాయి సాంకేతిక నిపుణులు కార్మికులు  ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఎన్నో. ఈ కారణంగానే షూటింగులు చేసేందుకు ఎవరికీ ధైర్యం చాలడం లేదు.

సరే ఇదంతా ఎప్పుడు సద్దుమణుగుతుందనే క్లారిటీ ఎవరికీ లేదు. మే ఎలాగూ కర్పూరమయ్యింది. జూన్ మీద పెద్దగా ఆశలు పెట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు. జులై నుంచి నార్మల్ అయితే సంతోషమే. అయితే కొన్ని రంగాలకు మాత్రం ఆపై కూడా కఠిన ఆంక్షలు తప్పవనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఇంకో ఆరు నెలల పాటు థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీతోనే అనుమతులు ఇచ్చే దిశగా గవర్నమెంట్స్ ఆలోచిస్తున్నాయనే టాక్ ఉంది. ఒకవేళ అదే నిజమైతే ఆచార్యతో మొదలుపెట్టి ఆర్ఆర్ఆర్ దాకా ఏదీ రిలీజయ్యే ఛాన్స్ ఉండదు. చిన్న మరియు మీడియం బడ్జెట్ మూవీస్ ధైర్యం చేయక తప్పదు.  

ఇదే నిజమైతే మాత్రం 2022 మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో క్రేజీ ప్రాజెక్ట్స్ క్యూలో ఉన్నాయి. పుష్ప1, కెజిఎఫ్ 2, ఆచార్య, ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్, మేజర్, అఖండ, లవ్ స్టోరీ, టక్ జగదీశ్, నారప్ప, దృశ్యం 2 ఇలా ఫినిషింగ్ కి దగ్గరలో ఉన్న సినిమాల లిస్టు  చాంతాడంత ఉంది. మరి ఫిఫ్టీ పర్సెంట్ మోడల్ వీటికి సూట్ కాదు. రవితేజ క్రాక్ అయినా కూడా వసూళ్లు రాబట్టింది కానీ ఆ గ్యారెంటీని ప్రతి సినిమాకు ఆశించలేం. అందులోనూ కరోనా రెండో దశ చాలా తీవ్రంగా దారుణంగా ఉంది. చూడాలి రాబోయే గడ్డు రోజులను ఎగ్జిబిటర్లు ఎలా ఎదురుకుంటారో. లేదంటే ఓటిటికి మరో బూమ్ తప్పదు
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp