గర్జించిన కొమురమ్ భీం : RRRలో తారక్

By iDream Post Oct. 22, 2020, 11:49 am IST
గర్జించిన కొమురమ్ భీం : RRRలో తారక్

నెలలు తరబడి కళ్ళలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆకలిని తీరుస్తూ ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీం ఫస్ట్ లుక్ ఇందాక వీడియో టీజర్ రూపంలో విడుదలైయ్యింది. అందరూ ఊహించినట్టే రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో రాజమౌళి తనదైన స్టైల్ లో పాత్రను పరిచయం చేశారు. "వాడు కనపడితే సముద్రాలు తడబడతాయి, నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి, వాడి పొగరు ఎగిరే జెండా, వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ, వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ, నా తమ్ముడు గోండు బెబ్బులి కొమురమ్ భీం" అంటూ చరణ్ వాయిస్ ఓవర్ లో సాయి మాధవ్ బుర్రా సంభాషణలు, అద్భుతమైన విజువల్స్ తో జూనియర్ ఎన్టీఆర్ సింహగర్జన కనిపించింది వినిపించింది.

ఆశ్చర్యపోయే రీతిలో ఒంటి మీద కేవలం లంగోటా లాంటి వస్త్రాన్ని మాత్రమే ధరించి తారక్ ను చూపించిన తీరు. అడవిలో పరిగెత్తే వైనం, సంకెళ్లు తెంచుకునేందుకు గర్జించిన సన్నివేశం అభిమనులకు మాములు పండగాలా లేదు. స్వతంత్ర ఉద్యమాన్ని కొన్ని షాట్స్ లో అలా టచ్ చేసి వదిలేయడం కూడా బాగుంది. గతంలో వచ్చిన అల్లూరి రామరాజు టీజర్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఇంకా చెప్పాలంటే అంతకు మించి అనేలా వీడియోని కట్ చేశారు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదే స్థాయిలో ఎలివేట్ అయ్యింది. యంగ్ టైగర్ కొమరం భీంగా అణువణువూ ఒదిగిపోయాడు. ఈ టీజర్ మీద ఇంత హైప్ రావడానికి మరో కారణం అరవింద సమేత వీర రాఘవ తర్వాత రెండేళ్ల భారీ గ్యాప్ తో జూనియర్ ఎన్టీఆర్

లాక్ డౌన్ దెబ్బకు ఏడు నెలలకు పైగా షూటింగ్ కు బ్రేక్ పడిన ఆర్ఆర్ఆర్ ఇటీవలే సెట్స్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. దాని తాలూకు వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇకపై రెగ్యులర్ గా కొనసాగించబోతున్నారు. అలియా భట్ కూడా వచ్చేందుకు అంగీకారం తెలిపినట్టు వార్తలు వచ్చాయి. సినిమా మొత్తం కనిపించే పాత్ర కాకపోవడంతో త్వరగానే పూర్తి చేసేలా ప్లాన్ చేశారు జక్కన్న. తారక్ జోడి ఒలివియా మోరిస్ గురించి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు. అంతర్జాతీయ ప్రయాణాల మీద ఉన్న ఆంక్షలు సడలించడంతో తనతో కూడా యూనిట్ మాట్లాడుతున్నట్టుగా సమాచారం. మొత్తానికి చెప్పిన టైంకంటే టీజర్ ని అరగంట ఆలస్యంగా విడుదల చేసినా అంచనాలను అందుకోవడంలో ఆర్ఆర్ఆర్ టీమ్ సక్సెస్ అయ్యింది

Link Here @ https://bit.ly/3onion5

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp