భారతీయుడు 2 ఏం చేయబోతున్నాడు ?

By Ravindra Siraj Jan. 17, 2020, 02:26 pm IST
భారతీయుడు 2 ఏం చేయబోతున్నాడు ?

1996వ సంవత్సరం. దర్శకుడిగా శంకర్ పేరు అప్పటికే దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. హిందీలో డబ్ చేసిన సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతున్నాయి. ఆ టైంలో వచ్చిందే కమల్ హాసన్ భారతీయుడు . స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఓ యోధుడు ఇప్పటి సామాజిక పరిస్థితులను తట్టుకోలేక అన్యాయం అవినీతికి పాల్పడిన వాళ్ళ అంతు చూడటమే ఇందులో మెయిన్ పాయింట్.

శంకర్ టేకింగ్, రెహమాన్ అద్భుతమైన సంగీతం నటీనటుల పెర్ఫార్మన్స్ వెరసి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పటికీ ఈ ఆల్బం మ్యూజిక్ లవర్స్ కి హాట్ ఫేవరెట్. ఇన్నాళ్ళకు దీని సీక్వెల్ కార్యరూపం దాలుస్తోంది. దానికి కొనసాగింపుగా ఇది ఉంటుందని శంకర్ అంటున్నాడు కాబట్టి ఎలా కంటిన్యూ చేస్తారా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. హీరొయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అయితే మొదటి భాగంలో సుకన్య పోషించిన పాత్రే తనకు ఆఫర్ చేశారట. అంటే కాజల్ ని ప్రోస్తేటిక్ మేకప్ లో 80 ఏళ్ళ బామ్మగా చూడబోతున్నాం అన్నమాట.

అప్పట్లో భారతీయుడు చేసిన టైంకి సుకన్యది కూడా ఇంచుమించు కాజల్ వయసే. అది విడుదలైన సమయానికి తనకు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు అందరూ మర్చిపోయారు. అందుకే శంకర్ తెలివిగా కాజల్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఫస్ట్ పార్ట్ లో కొడుకుని హత్య చేశాక సేనాపతి విదేశాలకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు మళ్లి ఇండియాకు తిరిగి రావడం దగ్గరి నుంచి ఏం జరిగిందనేది ఇండియన్ 2లో చూపించబోతున్నారు. మరి 24 ఏళ్ళ వెనుకటి మేజిక్ భారతీయుడు ఇంకోసారి రిపీట్ చేస్తాడా లేదా వేచి చూడాలి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp