బిబి3 గందరగోళం ముగిసింది

By iDream Post Nov. 21, 2020, 04:06 pm IST
బిబి3 గందరగోళం ముగిసింది

టాలీవుడ్లో సీనియర్ హీరోలకు హీరోయిన్లనుఫామ్ లో ఉన్న వాళ్ళు ఆసక్తి చూపకపోవడం ఒక కారణమైతే ఏదో ఒకటిలే అని ఒప్పుకున్నవాళ్ళు జోడిగా సెట్ కాకపోవడం అతి పెద్ద సమస్యగా మారింది. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాకూ ఇది ఎంత పెద్ద తలనెప్పిగా మారిందో చూస్తూనే ఉన్నాం. ఒకరు ఫైనల్ కావడం ఆ వెంటనే మార్పు జరగడం, మళ్ళీ సెట్ చేయడంలో దర్శక నిర్మాతలు పడుతున్న తిప్పలు అన్ని ఇన్ని కావు. అరవై పడి దాటిన స్టార్ల సరసన నటించేందుకు చేంజ్ చేయడం దీనికి సంబంధించిన వార్తలతోనే అభిమానులు విపరీతమైన కన్ఫ్యూజన్ కు గురయ్యారు.

కొద్దిరోజుల క్రితమే తీసుకున్న సాయేషా సైగల్ కూడా తప్పుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన స్థానంలో ప్రగ్య జైస్వాల్ వచ్చేసి ఈ రోజు నుంచే షూటింగ్ లో కూడా పాల్గొంది. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారనే వార్తకు కూడా చెక్ పెట్టేశారు. ప్రగ్య మాత్రమే బాలయ్యతో ఆడి పాడుతుంది. గతంలో నాగార్జున లాంటి ఏజ్ హీరోతో చేసింది కాబట్టి లుక్స్ పరంగా ఎలాంటి ఇబ్బంది కనిపించదు. లాక్ డౌన్ వల్ల ఇప్పటికే విపరీతమైన ఆలస్యానికి గురైన బిబి3ని ఏకధాటిగా నాలుగైదు నెలల్లోనే పూర్తి చేయాలని బోయపాటి శీను ప్లానింగ్ తో ఉన్నాడు. బడ్జెట్ ని కూడా పూర్తి కంట్రోల్ లోనే సెట్ చేశారట.

డ్యూయల్ రోల్ లో బాలకృష్ణ కనిపించబోయే ఈ సినిమాలో అన్నింటి కంటే అఘోరా గెటప్ మీదే ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటిదాకా కెరీర్ లో ఇలాంటి పాత్ర చేయకపోవడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ పీక్స్ లో ఉంది. హీరోయిన్ ప్రగ్యానే అయినప్పటికి మరో రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ సీనియర్ నటీమణులతో చేయిస్తారట. సింహా లెజెండ్ తర్వాత చేస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో మరోసారి బాలయ్యని ఓ రేంజ్ లో చూపిస్తారని బోయపాటి మీద అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ రెండు భాగాలు, రూలర్ డిజాస్టర్ల తర్వాత ఖచ్చితంగా హిట్టు కొట్టాల్సిన అవసరం బాలకృష్ణకు చాలా ఉంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp