పవర్ ఫుల్ పేరుతో బాలయ్య

By iDream Post Apr. 12, 2021, 01:30 pm IST
పవర్ ఫుల్ పేరుతో బాలయ్య
రేపు ఉగాది పండగ సందర్భంగా బాలకృష్ణ బోయపాటి శీను కాంబినేషన్ లో రూపొందబోయే టైటిల్ ని ఫస్ట్ లుక్ తో పాటు ప్రకటించబోతున్నారు. నందమూరు అభిమానులు ఇప్పటికే దీని పట్ల చాలా యాంగ్జైటిగా ఉన్నారు. ఎన్టీఆర్ రెండు భాగాలు, రూలర్ డిజాస్టర్ల తర్వాత తమ హీరోకు బోయపాటి అయితేనే హ్యట్రిక్ బ్లాక్ బస్టర్ ఇచ్చి ఉత్సాహాన్ని ఇస్తాడని నమ్ముతున్నారు. అయితే నెలలు గడుస్తున్నా దీని టైటిల్ కు సంబంధించి రకరకాల ప్రచారాలు జరిగాయి కానీ ఏదీ ఖరారు కాలేదు. ముందు మోనార్క్ అన్నారు. ఆ తర్వాత గాడ్ ఫాదర్ అన్నారు. మరోసారి టార్చ్ బేరర్ అన్నారు. కానీ ఏదీ నిజం కాదని తేలిపోయింది.

లేటెస్ట్ గా లీకైన అప్ డేట్ ప్రకారం దీనికి 'అఖండ' పేరుని ఫిక్స్ చేసినట్టుగా తెలిసింది. ఇది ఇప్పటిదాకా వాడని టైటిల్. ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ కాలంలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా అఖండుడు వచ్చింది కానీ ఆ తర్వాత ఎవరూ తీసుకోలేదు. సంస్కృత సౌండింగ్ వినిపిస్తున్నప్పటికీ సబ్జెక్టు ప్రకారం ఇలాంటి పవర్ ఫుల్ టైటిల్ అయితేనే బాగుంటుందని భావించి బాలయ్య శీనులతో సహా టీమ్ మొత్తం దీనికే ఓటు వేసినట్టు కనిపిస్తోంది. ఒకవేళ ఈ న్యూస్ లో ఏదైనా ట్విస్ట్ ఉంటే అది తెలిసేది రేపే. రెండు విభిన్నమైన పాత్రలు చేస్తున్న బాలయ్య డ్యూయల్ రోల్స్ చేస్తున్నారని ఇప్పటికే టాక్ ఉంది.

ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా చేస్తుండగా పూర్ణ చాలా ముఖ్యమైన క్యారెక్టర్ ఒకటి చేస్తోంది. ప్రతినాయకుల గ్యాంగ్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. ఇటీవలి కాలంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్లతో అదరగొడుతున్న తమన్ సంగీతం ఇప్పుడీ మూవీకి చాలా పెద్ద అట్రాక్షన్ గా మారబోతోంది. గతంలో బోయపాటి లెజెండ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ కి అవకాశం ఇచ్చినప్పుడు ఏ రేంజ్ లో అవుట్ ఫుట్ వచ్చిందో చూసాం. బీజీఎమ్ కు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకునే బోయపాటి తమన్ నుంచి ఎలాంటి అవుట్ ఫుట్ రాబట్టుకున్నాడో చూడాలి. మే 28 రిలీజ్ డేట్ కు ఈ అఖండ(ప్రకటన రాలేదు)కట్టుబడుతుందా లేదా వేచి చూడాలి
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp