బాలకృష్ణ అఘోరాగా మారుతున్నారా?

By Kiran.G Feb. 04, 2020, 02:10 pm IST
బాలకృష్ణ అఘోరాగా మారుతున్నారా?

బాలకృష్ణ బోయపాటి శ్రీనుల కాంబినేషన్ వస్తుంది అంటే అభిమానులకు కన్నుల పండగే.. బాలకృష్ణ శైలికి అనుగుణంగా సినిమాలు ఎలా రూపొందించాలో బోయపాటి శ్రీనుకు బాగా తెలుసు.. అందుకు ఉదాహరణగా సింహా, లెజెండ్ సినిమాలను చెప్పుకోవచ్చు..

వరుస అపజయాలతో కుంటుబడిన బాలకృష్ణ సినీ జీవితాన్ని మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కించిన ఘనత బోయపాటిదే.. ఆ తరువాత వాళ్ళ కాంబినేషన్ లో లెజెండ్ కూడా వచ్చింది. బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన లెజెండ్ ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్ లో 1000 రోజులు ప్రదర్శించబడిందంటే ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ముచ్చటగా మూడోసారి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో మరో మూవీ మొదలయ్యింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి, మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, శ్రీకాంత్ విలన్ పాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. కాగా ఇందులో బాలకృష్ణ కొన్ని సన్నివేశాల్లో అఘోరాగా నటిస్తున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

బాలకృష్ణ విభిన్న పాత్రలకు పెట్టింది పేరు. అఘోరాగా బాలయ్య నటించడం ఏంటని సినీవర్గాల్లో చర్చించుకుంటున్నారు. రెండు విభిన్న కోణాల్లో సాగే పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నాడని అందులో అఘోర పాత్ర కూడా కీలకం అన్న లీకులు బయటకు వస్తున్నాయి. అఘోరాగా బాలకృష్ణ అదరగొడతారని,బాలకృష్ణలో ఉన్న పొటెన్షియాలిటీని పూర్తి స్థాయిలో తెరపై చూపించగల సత్తా బోయపాటికి ఉందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

విభిన్న పాత్రలు చేయడంలో బాలకృష్ణ ముందుంటారు. ఆదిత్య 369,భైరవ ద్వీపం, శ్రీ రామరాజ్యం లాంటి సినిమాలు ఆయనలో ఉన్న ప్రతిభను చాటి చెప్పాయి. మరి అఘోరాగా బాలయ్య నటన ఎలా ఉంటుందో సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp