ఈ క్రేజీ రీమేక్ ఎవరు చేస్తారో

By iDream Post Mar. 19, 2020, 06:20 pm IST
ఈ క్రేజీ రీమేక్ ఎవరు చేస్తారో

గత కొద్దిరోజులుగా మలయాళంలోనే కాదు సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారిన చిత్రం 'అయ్యపనుమ్ కోశియుమ్'. పృథ్విరాజ్, బిజూ మీనన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఒక్క కేరళలోనే 50 కోట్లకు పైగా షేర్ రాబట్టి ట్రేడ్ తో వహ్వా అనిపించుకుంది. తమిళ రైట్స్ కొద్దిరోజుల క్రితమే అమ్ముడుపోగా తాజాగా తెలుగు వెర్షన్ రీమేక్ హక్కులు జెర్సి, అల వైకుంఠపురములో ప్రొడక్షన్ పార్ట్నర్ సూర్యదేవర నాగ వంశీ తీసుకున్నట్టుగా తెలిసింది. ఓ పోలీస్ ఆఫీసర్ కి, ఓ రిటైర్డ్ హవల్దార్ కు మధ్య జరిగిన ఈగో వార్ కాన్సెప్ట్ తో దర్శకుడు రంజిత్ దీన్ని అద్భుతంగా తెరకెక్కించారు.

క్రిటిక్స్ సైతం ఈ సినిమాను పొగడ్తలతో ముంచెత్తారు. 3 గంటల నిడివి ఉన్న ఈ చిత్రం ఆద్యంతం ఎమోషనల్ డ్రామాతో చాలా గ్రిప్పింగ్ గా సాగుతుంది. పృథ్విరాజ్, బిజు మీనన్ ల పోటాపోటీ నటనకు మెచ్చుకోకుండా ఉండలేం. డ్రైవింగ్ లైసెన్స్ తర్వాత ఇంత తక్కువ గ్యాప్ లో పృథ్విరాజ్ కు మరో హిట్ దక్కడం పట్ల అభిమానుల సంతోషం మాములుగా లేదు. అయితే తెలుగులో ఈ పాత్రలు ఎవరు చేస్తారు అనేది సస్పెన్సుగా మారింది. ఒకటి ఏజ్ బార్ రోల్ కాగా ఇంకోటి మధ్యవయసుకు సంబంధించినది.

సో ప్రకాష్ రాజ్ ను ఒక ఛాయస్ గా అనుకున్నా రెండో పాత్ర విక్టరీ వెంకటేష్ తో చేయించే దిశగా ఆలోచనలు జరుగుతున్నట్టు వినికిడి. కానీ ప్రస్తుతం తమిళ అసురన్ రీమేక్ నారప్పలో చేస్తున్న వెంకీ ఇంత తక్కువ గ్యాప్ లో ఇంకోటి చేస్తాడా అనేది అనుమానమే. ఒకవేళ వెంకీ వద్దనుకున్నా నాగార్జున సైతం మంచి ఛాయస్ గా నిలుస్తాడు. యూత్ హీరోలైతే దీనికి సెట్ అవ్వరు. ఒకవేళ క్రేజీ స్టార్ క్యాస్ట్ కావాలంటే మాత్రం ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ రంగంలో దిగినా ఆశ్చర్యం లేదు. టైటిల్ కూడా 'జానీ జనార్దనం' అనే ప్రచారం మొదలయ్యింది. తెలుగులో ఈ ఏడాదిలో ఇప్పటికే ఆరేడు రీమేక్ లు నిర్మాణంలో ఉండగా ఇప్పుడు ఇది కూడా లిస్ట్ లోకి చేరిపోయింది. కరోనా గోల ఆగిపోయాక దీనికి సంబంధించిన క్లారిటీ రావొచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp