ఆల వైకుంఠపురములో మిస్సవుతున్న రికార్డులు

By iDream Post Jul. 28, 2020, 07:00 pm IST
ఆల వైకుంఠపురములో మిస్సవుతున్న రికార్డులు

ఈ ఏడాది లాక్ డౌన్ మార్చి నుంచి మొదలైంది కానీ అంతకు ముందు సంక్రాంతి పండక్కు విడుదలైన అల వైకుంఠపురములో నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకుని ఇండస్ట్రీ హిట్ గా అవతరించడం చూసాం. యుట్యూబ్ లోనూ దీని సంచలనాలు ఆగడం లేదు. ఇప్పటికే ఈ సినిమా తాలూకు ఐదు అఫీషియల్ వీడియోలు ఒక్కొకటి వంద మిలియన్ల వ్యూస్ సాధించి ఎవరికీ సాధ్యం కానీ ఫీట్లను సొంతం చేసుకుంటోంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఏ ఇండియన్ సినిమాకు దక్కని ఘనత సొంతమయ్యే ఛాన్స్ అతి దగ్గరలో ఉంది. అయితే ఇంత చేసిన అల వైకుంఠపురములో ఒక్క విషయంలో మాత్రం వెనుకబడే ఉంది.

ఇప్పటిదాకా దీని శాటిలైట్ టెలికాస్ట్ జరగలేదు. వైరస్ ఉధృతి తీవ్రంగా ఉండి అందరూ ఇళ్లలోనే ఉన్న సమయంలో మే 1న ప్రసారం చేస్తామని అప్పుడెప్పుడో ప్రకటించి ఆ తర్వాత డ్రాప్ అయ్యారు. ఎప్పుడు ప్రసారం చేసేది మళ్ళీ చెప్పనే లేదు. కొత్తగా కమింగ్ సూన్ అంటూ యాడ్స్ వేసి ఊరిస్తున్నారు. సన్ నెక్స్ట్, నెట్ ఫ్లిక్స్ యాప్ లో ఎప్పుడో ప్రీమియర్ అయిపోయిన ఈ సినిమాకు ఇంత లేట్ ఎందుకు చేస్తున్నారో అంతు చిక్కడం లేదు. ఆల వైకుంఠపురములోతో పాటే విడుదలైన సరిలేరు నీకెవ్వరూ అదే జెమిని ఛానల్ లో ఇప్పటికే రెండు సార్లు వచ్చింది. ఫస్ట్ ప్రీమియర్ లో 23 పైగా రేటింగ్ తెచ్చుకుని మైండ్ బ్లాంక్ చేసింది.రెండో సారి కూడా 17పైగా తెచ్చుకుని ఔరా అనిపించింది. ఇదే ఇంత అద్భుతాలు చేస్తే అల వైకుంఠపురములో ఏ స్థాయిలో మేజిక్ చేస్తుందో వేరే చెప్పాలా.

ఎందుకో మరి ఇంకా మీనమేషాలు లెక్కబెడుతూనే ఉన్నారు. ఇప్పటికే 7 నెలలు గడిచిపోయాయి. లోకల్ ఛానల్స్ లో ఈపాటికే వేసేసి ఉంటారు. సరిలేరు క్రాస్ చేసే సత్తా ఒక్క బన్నీ మూవీకే ఉంది. అందుకే ఇలా ఊరించి ఊరించి వేస్తున్నారు కాబోలు. అయినా వేడి ఉన్నప్పుడే పాలు కాగబెట్టాలి తరహాలో క్రేజ్ ఉన్నప్పుడే టీవీలో సినిమాలు వేస్తే బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతుంది. కెజిఎఫ్ కు ఇలాగే ఎక్కువగా ఊహించుకుని లేట్ చేసినందుకు యావరేజ్ రేటింగ్స్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు కాబట్టి అల వైకుంఠపురములో బుల్లి తెర ప్రవేశానికి త్వరగా ముహూర్తం ఫిక్స్ చేస్తే బెటర్. లేదంటే టిఆర్పి రేటింగ్స్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది. అభిమానులు అడుగుతోంది కూడా ఇదే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp