రికార్డ్ ధరకు అమ్ముడైన "అరవింద సమేత" ఓవర్ సీస్ రైట్స్
By iDream Post

Follow us:
Follow @iDreamPost
త్రివిక్రమ్ శ్రీనివాస్, యాంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం "అరవింద సమేత". హారిక-హాసిని క్రియేషన్స్ పై కె. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది. తమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రానికి ఓవర్ సీస్ లో భారీ క్రేజ్ నెలకొంది. ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అయిన బ్లు స్కై సినిమాస్ ఈ చిత్ర ఓవర్ సీస్ రైట్స్ ను 11కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. గతంలో ఎన్టీఆర్ నటించిన "జై లవకుశ" చిత్రం ఓవర్ సీస్ రైట్స్ 8కోట్ల50లక్షల రూపాయల రికార్డ్ ను ఇప్పుడు "అరవింద సమేత" తిరగరాసింది. నిర్మాణ దశలోనే భారీ క్రేజ్ ను నెలకొల్పుతున్న ఈ చిత్రం విడుదలయ్యాక ఇంకెన్ని రికార్డ్స్ ని తిరగరాస్తుందో చూడాలి.


Click Here and join us to get our latest updates through WhatsApp