అనుష్క ఛాయస్ ఆ సినిమాలే

By iDream Post Jun. 13, 2020, 10:20 pm IST
అనుష్క ఛాయస్ ఆ సినిమాలే

భాగమతి వచ్చి రెండేళ్లు దాటింది. లేట్ అయితే అయ్యింది పోనీ నిశ్శబ్దం చూస్తాం కదా అనుకుంటే కరోనా లాక్ డౌన్ దెబ్బకు మళ్లీ వాయిదా పడింది. థియేటర్లో వస్తుందా లేదా ఓటిటినా అనేది ఎవరికీ తెలియదు. క్రైమ్ థ్రిల్లర్ కం హారర్ జానర్ లో రూపొందిన ఈ సినిమా గత ఆరు నెలలుగా పలుమార్లు వాయిదా పడింది. ఇప్పటికైతే సెన్సార్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. దీని సంగతలా ఉంచితే అనుష్క తర్వాత ఏ మూవీ చేస్తోందన్న విషయం మీద ఇప్పటికీ క్లారిటీ లేదు. మహేష్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పిందన్న టాక్ ఫిలిం నగర్ లో జోరుగా సాగుతోంది. ఇతను ఎవరా అని ఆలోచిస్తున్నారా.

సందీప్ కిషన్ తో కొన్నేళ్ళ క్రితం తీసిన రారా కృష్ణయ్యకు డైరెక్టర్. అది డిజాస్టర్. మరి ఎందుకు రిస్క్ చేస్తున్నట్టు అంటే అతను చెప్పిన కథ అంత పవర్ ఫుల్ గా ఉందట. ఫీమేల్ ఓరియెంటెడ్ గా ఉంటూనే చాలా డిఫరెంట్ గా అనిపించే లైన్ తో స్వీటీని మెప్పించాడట. యువి సంస్థనే దీన్ని నిర్మిస్తున్నట్టు వినికిడి. అయితే నిశబ్దం రిలీజ్ తర్వాతే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుంది. నిజానికి భాగమతి టైంలో ఆ దర్శకుడు అశోక్ కూడా ఫ్లాపులోనే ఉన్నాడు. అయినా కథను నమ్మి ఓకే చేసింది. ఫలితం సూపర్ హిట్ రూపంలో దక్కింది. అందుకే మహేష్ తోనూ అదే రిపీట్ అవుతుందన్న నమ్మకం కాబోలు.

దీన్ని బట్టి చూస్తే అనుష్క కేవలం తన పాత్ర ప్రాధాన్యత ఉండే కథలను మాత్రమే ఒప్పుకునేలా కనిపిస్తోంది. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు అయ్యింది. ఇప్పటికీ యూత్ హీరోల సరసన ఆఫర్లంటే కష్టం. పైగా తనకు నప్పవు కూడా. అందుకే ఇలాంటివి ఎంచుకోవడం మంచి నిర్ణయమే. గతంలో విజయశాంతి కూడా ఇలాంటి ఫేజ్ వచ్చినప్పుడు ఒసేయ్ రాములమ్మా లాంటి విమెన్ సెంట్రిక్ మూవీస్ చేసి కెరీర్ ని ఇంకో పదేళ్ళు పెంచుకున్నారు. మరి అనుష్క ఆలోచన కూడా అలాగే కనిపిస్తోంది. ఇదంతా ఓకే కాని పెళ్ళెప్పుడు అన్న ప్రశ్నను అడగొద్దు అంటున్న స్వీటీని పెళ్లి కూతురిగా చూడాలన్న అభిమానుల ముచ్చట ఎప్పుడు తీరుతుందో.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp