ప్రభాస్ సినిమాకు మళ్ళీ ట్విస్టు

By iDream Post Jul. 08, 2020, 11:35 am IST
ప్రభాస్ సినిమాకు మళ్ళీ ట్విస్టు

ఏంటో బాహుబలితో మొదలుకుని వాయిదా మార్పులు ప్రభాస్ ప్రతి సినిమాకు చాలా మాములు విషయమైపోయింది. కాకపోతే చేసిన పొరపాట్లే మళ్ళీ మళ్ళీ జరగడమే అభిమానులను టెన్షన్ పెడుతోంది. విషయానికి వస్తే జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఓ 40 శాతం పూర్తయ్యిందన్న టాక్ వచ్చింది కానీ యూనిట్ తరఫున కనీసం టైటిల్ కన్ఫర్మేషన్ కూడా లేదు. మరో ట్విస్ట్ ఏంటంటే రాధే శ్యామ్ పేరు ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు ఇప్పటిదాకా మ్యూజిక్ డైరెక్టర్ ని ఫైనల్ చేయలేదు. ముందు అమిత్ త్రివేది అన్నారు. తర్వాత ఏదో కాల్ షీట్స్ సమస్య వల్ల డియర్ కామ్రేడ్ కు పనిచేసిన జస్టిన్ ప్రభాకర్ ఫిక్స్ అనే ప్రచారం జరిగింది .

ఇప్పుడు అతనూ కాదట. ఫ్రెష్ గా జూలియస్ పకీయం పేరు తెరమీదకు వచ్చింది. ఇతను సైరాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. అది అద్భుతం అనే పేరు తెచ్చుకోలేదు కానీ ఉన్నంతలో డీసెంట్ గా ఇచ్చారు. ఇప్పుడు ప్రభాస్ 20కి తననే ఫైనల్ చేసే ప్రతిపాదన జోరుగా ఉందట. అప్ డేట్స్ ఇవ్వడంలో యువి సంస్థ ముందు నుంచి అలసత్వంగానే ఉండటం వల్ల ఖచ్చితమైన సమాచారం ఏదీ లేదు. నిజానికి జూలియస్ పకియంని తీసుకోవడం పాన్ ఇండియా అప్పీల్ కోసమే అని చెప్పాలి. సాహో పాటల కోసం ఒక్కరితో కాకుండా ఇద్దరు ముగ్గురితో చేయించారు కాని మ్యూజిక్ పరంగా ఆశించిన గొప్ప ఫలితమైతే దక్కలేదు. రెండు పాటలు పర్వాలేదు అనిపించాయి తప్ప బెస్ట్ ఆల్బం కాలేకపోయింది.

అందుకే దీనికి సోలోగా జూలియస్ పకియం వైపే గట్టిగా మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. జూలియస్ పకియం సుల్తాన్, ఎక్ థా టైగర్ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ కి సంగీతం ఇచ్చిన అనుభవం ఉంది. కాకపోతే వీళ్ళ ట్యూన్స్ నార్త్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఉంటాయి. మనకేమో అవి అంతగా కనెక్ట్ కావు. భీభత్సమైన ఫాంలో ఉన్న తమన్ లాంటి వాళ్ళను కాకుండా హిందివాళ్ళ వెనుక ఎందుకు పడుతున్నారనే ఫ్యాన్స్ ప్రశ్నకు సమాధానం పాన్ ఇండియా కోసం అని తప్ప మరో సమాధానం ఆశించలేం. బిజినెస్ విషయంలో ఇలాంటి అంశాలే చాలా కీలక పాత్ర పోషిస్తాయి. లాక్ డౌన్ మూడు నెలలు దాటాక రేపు ఉదయం 10 గంటలకు ఈ సినిమా తాలుకు ఫస్ట్ లుక్ విడుదల చేయబోవడం అసలైన గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp