బిబి3 గురించి ఇంకో ట్విస్టు

By iDream Post Nov. 06, 2020, 12:02 pm IST
బిబి3 గురించి ఇంకో ట్విస్టు

నందమూరి బాలకృష్ణ బోయపాటి శీను కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు కథలో కంటే బయట ట్విస్టులే ఎక్కువయ్యాయి. హీరోయిన్ల సమస్య కొలిక్కి వచ్చినట్టే వచ్చి మళ్ళీ మొదటికే వెళ్తోంది. ఇటీవలే మలయాళీ బ్యూటీ ప్రయాగ మార్టిన్ ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. కొత్తమ్మాయి కాబట్టి జంట ఫ్రెష్ గా కనిపిస్తుందని అభిమానులు కూడా భావించారు. కానీ తాజాగా జరిపిన ఫోటో షూట్ లో లుక్స్ పరంగా బాలయ్య, ప్రయాగ జోడిగా అంతగా సెట్ కాలేదట. తన వయసు కేవలం పాతికేళ్లే కావడంతో యూనిట్ సభ్యులకే తేడా అనిపించిందట. లేనిపోని కామెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించారని తెలిసింది.

దీంతో ఇప్పుడు ప్రయాగ మార్టిన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకునే అవకాశాలు ఎక్కువయ్యాయి. ఆల్మోస్ట్ డ్రాప్ అయ్యారని, తను ఉందని అధికారికంగా ఎలాగూ చెప్పలేదు కాబట్టి ఇదీ సైలెంట్ గానే కానిచ్చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. తన స్థానంలో ప్రగ్యా జైస్వాల్ వచ్చే ఛాన్స్ ఉందని వినికిడి. గతంలో జయజానకి నాయకలో మెయిన్ హీరోయిన్ కాకపోయినా బాగానే ఆడి పాడింది. సీనియర్ హీరోలతో చేసేందుకు అభ్యంతరం లేదని నాగార్జున ఓం నమో వెంకటేశాయలో చేయడం ద్వారా డైరెక్ట్ గానే చెప్పింది. సో బాలకృష్ణతో ప్రగ్యా కాంబో దాదాపు ఖాయమైనట్టే. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చాకే అప్పుడు అనౌన్స్ మెంట్లు ఇస్తారు.

ఇప్పటికే లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ చాలా వాయిదా పడింది. వేగంగా పూర్తి చేసేందుకు శీను పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు. పూర్ణ, అంజలిలను లాక్ చేయగా మరో ఇంపార్టెంట్ రోల్ ని భూమిక చేస్తోంది. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీకి ఇంకా టైటిల్ డిసైడ్ చేయలేదు. వీలైనంత త్వరగా ఫినిష్ చేసి వేసవికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాత. ఫ్యాక్షనిస్ట్ గా అఘోరాగా రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోయే బాలయ్య లుక్స్ మీద ఫ్యాన్స్ చాలా యాంగ్జైటిగా ఉన్నారు. టీజర్ ని ఇంతకు ముందే విడుదల చేయగా ఫస్ట్ లుక్ ని సంక్రాంతి కానుకగా ఇవ్వబోతున్నట్టు సమాచారం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp