మహేష్ బ్రాండ్ మీద మరో 'హీరో'

By iDream Post Jun. 23, 2021, 02:55 pm IST
మహేష్ బ్రాండ్ మీద మరో 'హీరో'

ఘట్టమనేని ట్యాగ్ లేదు కానీ ఆ కుటుంబం సపోర్ట్ తో వస్తున్న మరో హీరో గల్లా అశోక్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న డెబ్యూ మూవీకి హీరో టైటిల్ ని ఖరారు చేసి ఇందాకే మహేష్ బాబు ద్వారా టీజర్ ని లాంచ్ చేశారు. చిన్న వీడియోనే అయినప్పటికీ అశోక్ లుక్స్ ని ఇందులో పరిచయం చేశారు. కౌ బాయ్ గెటప్ తో పాటు సినిమాకు సంబంధించిన కొన్ని విజువల్స్ ని ఇందులో చూపించారు. కుర్రాడు చూసేందుకు బాగానే ఉన్నాడు కానీ స్క్రీన్ మీద ఎంత మేరకు మెప్పించేలా ఉంటాడనేది పూర్తి సినిమా చూశాకే క్లారిటీ వస్తుంది. ఎంత మహేష్ సపోర్ట్ ఉన్నా కూడా బాడీలో యాక్టింగ్ లో కంటెంట్ ఉంటేనే ఇక్కడ గెలవడం సాధ్యం.

టైటిల్ హీరో అని పెట్టారు కానీ ఇది గతంలో తెలుగు పరంగా అంత అచ్చిరాని పేరు. ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం చిరంజీవి హీరో అనే సినిమా చేశారు. పెద్దగా ఆడలేదు. మేకింగ్ పరంగా ఓకే అనిపించుకుంది కానీ ఫైనల్ రిజల్ట్ ఫెయిలే. చాలా గ్యాప్ తర్వాత నితిన్ అదే టైటిల్ తో ఇంకో మూవీ చేశాడు. ఇది ఎంత పెద్ద డిజాస్టర్ అంటే కనీసం ఈ పేరుతో ఓ చిత్రం వచ్చిందన్న సంగతి కూడా సామాన్య ప్రేక్షకులు మర్చిపోయేంత. ఇదే టైటిల్ తో విజయ్ దేవరకొండ తమిళ దర్శకుడితో ఓ ప్రాజెక్ట్ మొదలుపెట్టి కొంత భాగం షూట్ అయ్యాక ఆపేశాడు. ఇలా హీరో టైటిల్ వెనుక చాలా పెద్ద కథే ఉందన్న మాట

ఈ గల్లా అశోక్ హీరోలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, నరేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సత్య తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. టీజర్ లో గిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ అయ్యింది. బడ్జెట్ పరంగా బాగా ఖర్చు పెట్టిన విషయం విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. సమీర్ రెడ్డి- రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహణం సమకూర్చారు. రాజకీయ నాయకుల వారసులు హీరోలుగా ప్రూవ్ కావడం చాలా అరుదు. మరి అశోక్ ని ఎలా చూపిస్తారో వేచి చూడాలి. ఎంత బంధువైనా మహాస్హ్ సపోర్ట్ కొంతవరకే పనికొస్తుంది. సుధీర్ బాబు తరహాలో అశోక్ కూడా నిలబడతాడేమో చూడాలి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp