ఎఫ్3లో వాళ్ళెవ్వరూ ఉండరు

By iDream Post Apr. 06, 2020, 12:46 pm IST
ఎఫ్3లో వాళ్ళెవ్వరూ ఉండరు

గత ఏడాది సంక్రాంతికి భారీ మాస్ సినిమాలతో పోటీ పడి సక్సెస్ అయిన ఎఫ్2 సీక్వెల్ కి రంగం సిద్ధమవుతున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. సింపుల్ లైన్ తో కామెడీని ఆధారంగా చేసుకుని దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన గమ్మత్తు బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. దీనికి కొనసాగింపు ఉంటుందని నిర్మాత దిల్ రాజు ఆ టైంలోనే ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగానే స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలిసింది. హీరోలుగా వెంకటేష్, వరుణ్ తేజ్ లు కొనసాగుతున్నారు. తమన్నా, మెహ్రీన్ కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

అయితే ఇందులో మహేష్ బాబు లేదా రవితేజలు స్పెషల్ క్యామియో లాంటి పాత్ర చేస్తారని గతంలోనే ప్రచారం జరిగింది. ఫ్రెష్ అప్ డేట్ ప్రకారం అదేమీ లేదట. వెంకీ వరుణ్ లతోనే స్టోరీని ఇంకో కొత్త కోణంలో వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేయబోతున్నట్టు వినికిడి. అయితే ఎప్పటి నుంచి షూటింగ్ జరుగుతుందనదేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. వాస్తవానికి మూడో హీరోకి కావాల్సిన స్కోప్ ఉండేలా ముందో స్టోరీ లైన్ అనుకున్నారట. అయితే కరోనా వల్ల ఏకంగా నెల రోజులకు పైగా షూటింగులు వాయిదా పడిపోవడంతో ఎవరి డేట్స్ అయినా అంత ఈజీగా దొరికే పరిస్థితి లేదు.

దాంతో కథలో కొన్ని కీలకమైన మార్పులు చేసి దాన్ని లేపేశారట. అనిల్ రావిపూడి ప్రస్తుతం తన టీమ్ తో ఈ ఖాళీ సమయాన్ని ఎఫ్3 కోసమే పూర్తిగా కేటాయించినట్టు సన్నిహితుల మాట. సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాదే కొనసాగబోతున్నారని చెబుతున్నారు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ పెట్టుకుంటారా లేదా అనేది ఆర్ఆర్ఆర్ హైప్ మీద ఆధార పడి ఉంటుంది. క్లాష్ అయినా కూడా సంక్రాంతి సీజన్ రెండు మూడు భారీ సినిమాలకు అవకాశం ఇస్తుంది కాబట్టి దిల్ రాజు పోటీకే మొగ్గు చూపుతున్నారట. మొత్తానికి ఇంకా సెట్ పైకి వెళ్లకుండానే ఎఫ్3 గట్టి ప్రచారంలోనే నిలుస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp