క్రేజీ ఆఫర్లతో అనసూయ బిజీ

By iDream Post Aug. 25, 2021, 04:30 pm IST
క్రేజీ ఆఫర్లతో అనసూయ బిజీ

యాంకర్ గా ఉన్న పేరుతో పాటు సినిమాల్లో బాగానే రాణిస్తున్న అనసూయకు ఈ మధ్య కాలంలో క్రేజీ ఆఫర్లు గట్టిగానే వస్తున్నాయి. రంగస్తలంలో రంగమ్మత్తగా మెప్పించాక తన గ్రాఫ్ అమాంతం ఎగబాకింది. క్షణంలో చేసిన విలనీ కూడా వర్కౌట్ అయ్యింది. ఏ స్థాయిలో అంటే తనను సోలోగా పెట్టి కథనం లాంటి సినిమాలు చేసేంత. ఇప్పుడు చూస్తేనేమో వరసగా మెగా కాంపౌండ్ సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ దూసుకుపోతోంది. ఐకాన్ స్టార్ పుష్పలో ఎవరూ ఊహించని షాక్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. బాబ్డ్ హెయిర్ తో లీకైన ఒక స్టిల్ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యింది. ఇప్పుడు మరో మెగా ఆఫర్ తలుపు తట్టింది.

చిరంజీవి హీరోగా మోహనరాజా దర్శకత్వంలో రూపొందుతున్న లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ లో అనసూయకు ఓ ముఖ్యమైన పాత్రను ఇచ్చారట. ఈ విషయాన్ని తనే స్వయంగా పంచుకున్నట్టు సన్నిహితుల సమాచారం. ఒరిజినల్ వెర్షన్ లో లేని క్యారెక్టర్ ని ఇందులో సృష్టించారని మోహనరాజా చేసిన కీలక మార్పుల్లో ఇది ఒకటని అంటున్నారు. మలయాళం లూసిఫర్ లో హీరో తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్నది మంజు వారియర్ కు. కానీ అది నయనతార చేస్తోందో లేక అనసూయకు ఇచ్చారో ఇంకా క్లారిటీ లేదు. ఒక్కో అప్ డేట్ ని చాలా ప్లాన్డ్ గా ఇచ్చే ఉద్దేశంతో గాడ్ ఫాదర్ టీమ్ చాలా గుట్టుని మైంటైన్ చేస్తోంది.

సో అనసూయ కెరీర్ జోరు మీదే ఉంది. ఇది కాకుండా ఆచార్యలో కూడా తను ఉందట. రవితేజ ఖిలాడీ విడుదల కావాల్సి ఉంది. కృష్ణవంశీ రంగమార్తాండ ఆగిపోయిందో వస్తుందో తెలియదు. మలయాళంలో భీష్మ పర్వం అనే మూవీతో అక్కడ డెబ్యూ చేస్తోంది. ఇలా రెండు రంగాల్లో ఇంత బిజీగా ఉన్నది అనసూయ ఒక్కటే అని చెప్పాలి. మరోవైపు ఓటిటి సినిమాలు కూడా చేస్తోంది. ఆ మధ్య వచ్చిన థాంక్ యు బ్రదర్ రెస్పాన్స్ పరంగా ఎలా ఉన్నపటికీ పెర్ఫార్మన్స్ వరకు తనకు మంచి మార్కులే పడ్డాయి. ఆఫర్లు ఎన్ని వస్తున్నా ఆచితూచి అడుగులు వేస్తున్న అనసూయ నాలుగు పదుల వయసుకు దగ్గరలోనూ ఇంత బిజీగా ఉండటం విశేషం

Also Read : బాలీవుడ్ ని భయపెట్టిన బెల్ బాటమ్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp