కెజిఎఫ్ 2కి భీష్ముడి ట్విస్ట్

By Ravindra Siraj Feb. 26, 2020, 11:01 am IST
కెజిఎఫ్ 2కి భీష్ముడి ట్విస్ట్

మొన్న విడుదలై విజయవంతంగా నడుస్తున్న భీష్మలో నటించిన కన్నడ సీనియర్ నటులు అనంత నాగ్ గురించిన ఒక టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2018లో విడుదలై సంచలన బ్లాక్ బస్టర్ గా నిలిచిన కెజిఎఫ్ 1లో రాకీ భాయ్ కథ చెప్పే వ్యక్తి పాత్రలో ఈయన మెరిసిన సంగతి అందరికి గుర్తే. మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాళవిక అవినాష్ తో కలిసి సదరు పాత్ర స్టోరీ చెప్పే విధానం సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. సహజంగానే సెకండ్ పార్ట్ లో అనంత్ నాగ్ కొనసాగింపు ఉండాలి.

అయితే తాజా అప్ డేట్ ప్రకారం ఇందులో నుంచి ఆయన వైదొలగినట్టు సమాచారం. ఖచ్చితమైన కారణాలు తెలియలేదు కానీ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాటు హోంబాలే ఫిలిమ్స్ తో వచ్చిన అభిప్రాయ భేదాల వల్లే వదులుకున్నట్టు టాక్. ఇది నిజమైతే కెజిఎఫ్ 2కి ఒకరకంగా దెబ్బె అని చెప్పాలి. ప్రధాన పాత్ర కాకపోయినా దాని తాలూకు ఇంపాక్ట్ ఫస్ట్ పార్ట్ సినిమా మీద బలంగా ఉంది. అలాంటప్పుడు ప్రేక్షకులు కూడా అది ఉండాలనే ఆశిస్తారు. అది లేకుండా కథను ఎవరితో చెప్పిస్తారన్న విషయం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

స్క్రిప్ట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని అనంత నాగ్ గురించి శాండల్ వుడ్ లో చెప్పుకుంటారు. తన పాత్ర లెంత్ తో సంబంధం లేకుండా అంతా తెలుసుకున్నాకే ఒప్పుకుంటారని లేదంటే ఎంత పెద్ద దర్శకుడైనా నో చెబుతారని టాక్. నితిన్ భీష్మలో తాత పాత్ర కోసం ఆయన్ను ఒప్పించడానికి టీం చాలా కష్టపడాల్సి వచ్చిందట. సో ఇప్పుడు కేజిఎఫ్ 2లో ఏవో క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి ఉండొచ్చని వినికిడి. ప్రస్తుతం షూటింగ్ కీలక స్టేజిలో ఉన్న కేజిఎఫ్ 2 ఎప్పుడు విడుదల చేస్తారనే దాని గురించి క్లారిటీ లేదు. ఈ ఏడాది చివర్లో అంటున్నారు కాని యూనిట్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. సౌత్ లోనే అత్యంత క్రేజీ మూవీస్ లో ఒకటిగా రూపొందుతున్న కేజిఎఫ్ 2 బిజినెస్ రెండు వందల కోట్లు ఉండొచ్చని ట్రేడ్ అంచనా.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp