డిజిటల్ రంగంలో అమెజాన్ సంచలనం

By iDream Post May. 16, 2021, 05:20 pm IST
డిజిటల్ రంగంలో అమెజాన్ సంచలనం
ఎవరు అవునన్నా కాదన్నా కరోనాతో లాక్ డౌన్ సృష్టించిన పరిణామాల వల్ల ఓటిటికి ఎక్కడ లేని బూమ్ వచ్చిన మాట వాస్తవం. సామాన్య ప్రేక్షకులకు శాతం వీటి మీద అవగాహన పెరిగిపోయింది. చందాల ధరల్లో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ఎవరి అభిరుచి స్థోమతకు తగ్గట్టు ఆడియన్స్ వీటిని కొంటున్నారు. ఈ రంగంలో ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ టాప్ పొజిషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. కేవలం 999 రూపాయల ఏడాది చందాతో ఎక్కువ శాతం జనానికి చేరువ కావడంలో ఈ ప్రైస్ చాలా దోహదపడింది. నెట్ ఫ్లిక్స్ దూకుడు కూడా మాములుగా లేదు. హాట్ స్టార్, జీ5, సోనీ లివ్, ఆహా ఎవరికి వారు గట్టిగానే పోటీ పడుతున్నారు.

సరే అందివచ్చిన అవకాశాలను అలా వదిలేయకుండా వాటిని ఇంకా బలంగా వాడుకునేందుకు ప్రైమ్ కొత్త తరహా ప్లాన్లను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా కొత్తగా మినీ టీవీ అనే ఫ్రీ యాప్ ని లాంచ్ చేసింది. ఇందులో కంటెంట్ ని ఎవరైనా ఉచితంగా చూడొచ్చు. ఎలాంటి చందా అక్కర్లేదు. షాపింగ్ యాప్ లో వెళ్లినా దీని తాలూకు లింక్ కి వెళ్లిపోవచ్చు. ప్రస్తుతం ఇందులో మంచి వెబ్ సిరీస్ లు, ఇండిపెండెంట్ మూవీస్ ని పెట్టారు. అన్ని కూడా ఫ్యామిలీ ఓరియెంటెడ్ గా ఉండటం గమనించాల్సిన అంశం. ఇప్పటికే ప్రైమ్ ఉండగా దీన్ని తీసుకురావడంతో అమెజాన్ ఉద్దేశం వీలైనంత ఫాలోయర్ల కౌంట్ పెంచుకోవడమే.

ఇది ప్రస్తుతం ఇండియాలో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. దీన్ని బట్టి ఇక్కడి మార్కెట్ మీద అమెజాన్ ఎంత పెద్ద కన్ను వేసిందో అర్థమవుతుంది. ప్రస్తుతం ఇందులో కంటెంట్ ని అతి పెద్ద వెబ్ స్టూడియోస్ గా పేరున్న టివిఎఫ్, పాకెట్ ఏసెస్ అందిస్తున్నాయి. కొన్ని గతంలో యుట్యూబ్ లో వచ్చిన సిరీస్ లనే ఇందులో పెట్టారు కానీ రాబోయే రోజుల్లో ఫ్రెష్ అండ్ లేటెస్ట్ సిరీస్ లను ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రతినిధులు చెబుతున్నారు. లాగిన్ ఐడి, షాపింగ్ యాప్ ఉంటే చాలు మినీటీవీని ఎవరైనా ఎంజయ్ చేయొచ్చు. భవిష్యత్తులో సినిమాలు కూడా ఇందులో భాగం చేస్తారా లేదా అనేది వేచి చూడాలి
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp